పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/184

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభ్యులందరూ వ్యక్తిగతంగా ప్రేషితులు కావాలి. అందరూ దేవుని ప్రేమ సందేశాన్ని లోకానికి ఎరిగించాలి.

2. మూడవ సహస్రాబ్దంలో శ్రీసభ రూపం

మూడవ వేయి సంవత్సరాలు వచ్చాయి. ఈ కాలంలో తిరుసభలో పెను మార్పులు రావాలి. 1. క్రైస్తవ సమాజం క్రీస్తుపై కేంద్రీకృతం కావాలి. మన ప్రజలు ఏవో విశ్వాస సత్యాలను నమ్మితేనే చాలదు. వారికి క్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడాలి. విశేషంగా దివ్యస్రత్పసాద బలిలో ప్రభువును వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకోవాలి. 2. ఈ సమాజం ఆత్మచే నడిపించబడినదై వుండాలి. ఒకరినొకరు ప్రేమించడం, ఉన్నవాళ్ల లేనివాళ్ళతో పంచుకోవడం అనే లక్షణాలు కన్పించాలి. 3. ఈ సమాజం ప్రేషిత సేవకు పంపబడినది కావాలి. ఈ ప్రజలు ఇరుగుపొరుగు వారితో సంబంధం కలిగించుకోవాలి. వారికి క్రీస్తుని తెలియజేయాలి. వారి ధ్యేయం మతమార్పిడి కాదు. లోకంలోని అన్యాయాలనూ అక్రమాలనూ తొలగించడం. 4 క్యాతలిక్ సమాజం ఇతర ଔର୍ବ୍ବର୍ଟ సమాజాలతో కలసి పనిచేయాలి. జ్ఞానస్నానం ద్వారా పంపబడ్డం అనే లక్షణం ద్వారా క్రైస్తవులందరూ సోదరులే. 5. తిరుసభ ఇతర మతాలనూ వాటిల్లోని విలువలనూ అంగీకరించాలి. పవిత్రాత్మ ఇతర మతస్థుల హృదయాల్లోగూడ ప్రేరణం పుట్టిస్తూనే వుంటుంది. వాళ్ళకూడ దేవుణ్ణి చేరుకోవాలని కోరుకొంటూనే వుంటారు. 6. తిరుసభ మానవాభ్యుదయం కొరకు కృషిచేసేవాళ్ళందరితోను కలసి పనిచేయాలి. మనలాగే వాళ్ళకూడదైవరాజ్యాన్నిస్థాపిస్తున్నారు అనుకోవాలి. ఈ కార్యాలన్నీ సాధించడం సులభం కాదు. ఐనా దైవ బలంతో వాటిని కొంతవరకైనా సాధించవచ్చు.

3. తిరుసభ సభ్యులు ఎవరు?

ఇదివరకు మనం జ్ఞానస్నానం పొందినవాళ్ళు మాత్రమే తిరుసభ సభ్యులు e9óos”5 వాళ్ళం. కాని ఇప్పడు భావాలు మారాయి. దైవ రాజ్యాన్ని స్థాపించడం తిరుసభ బాధ్యత, ప్రేషిత సేవద్వారా ఈ కార్యాన్ని సాధిస్తాం. కాని ఎవరి పద్ధతిలో వాళ్ళు ఈ సేవచేసి దైవ సామ్రాజ్యాన్ని నెలకొల్పుతారు. అందుచే మనకు తెలియకపోయినా చాల వర్గాల ప్రజలు తిరుసభకు చెందివుంటారు.

1. జ్ఞానస్నానం పొందినవాళ్ళ తిరుసభ సభ్యులు. వీళ్ళ క్రీస్తు మరజోత్థానాలను విశ్వసిస్తారు. ప్రత్యక్షంగా తిరుసభ సభ్యులూ దైవరాజ్యసభ్యులూ ఔతారు. వీళ్ళ క్రీస్తుకి అంకితమైన వాళ్ళ సువిశేష విలువలను స్వయంగా జీవించి ఇతరులకు కూడ బోధిస్తారు.