పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/167

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. పోపుగారి ప్రధానత్వం

పూర్వాధ్యాయంలో చెప్పినట్లుగా బిషప్పలంతా కలసి అపోస్తలులకు వారసులు. కాని ఈ యపోస్తలులకు పేత్రు పెద్ద రోము బిషప్పగారయిన పోపుగారు ఈ పేత్రుకి వారసుడు. కనుక బిషప్పలందరిలోను ఆయన ప్రథముడు, ప్రముఖుడు, ప్రధానుడు, ఈ యధ్యాయంలో పోపుగారి ప్రధానత్వాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ మూడంశాలు వున్నాయి.

1. బైబులు బోధలు

గ్రీకు పదమైన "పాపాస్" ల్యాటినులో "పాపా" ఐ ఇంగ్లీషులో "పోప్"గా మారింది. ఈ శబ్దానికి తండ్రి, నాన్నఅని అర్థం. ఈ పదాన్ని మొదట బిషప్పలకూ మఠాధిపతులకు గూడ వాడేవాళ్లు. 6వ శతాబ్దం తర్వాత ఇది రోమాపురి బిషప్పకి మాత్రమే పరిమితమైంది, పోపుగారికి చాల బిరుదాలున్నాయి. వీటిల్లో "పేత్రుకి వారసుడు” అనేది ముఖ్యమైంది. దీన్నిబట్టే ఆయన విశ్వ తిరుసభకు అధికారి అయ్యాడు. బిషప్పల బృందానికి శిరస్సు అయ్యాడు.

కాని పోపుగారి ప్రధానత్వం అంటే ఏమిటి? పోపుగారు తిరుసభలోని బిషప్పులుకీ విశ్వాసులకీ అందరికీ అధిపతి. తిరుసభ అంతటిమీధ ఆయనకు సర్వోన్నతమైన అధికారం వుంది. ఆయన పేత్రుకి వారసుడు. పేత్రు రోమాపురి మేత్రాసనానికి బిషప్పు. పేత్రుని అపోస్తలులకు పెద్దనుగా నియమించిన ప్రభువు నుండే పోపుగారికి ప్రధానత్వం కూడ వచ్చింది. పోపుగారి ప్రధానత్వాన్ని మొదటి వాటికన్ సభ అధికార పూర్వకంగా ప్రకటనం చేసింది. రెండవ వాటికన్ సభ దృఢపరచింది. కనుక నేడు మనమందరం దీన్ని తిరుగులేని విశ్వాస సత్యంగా అంగీకరించాలి.
పోపుగారి ప్రధానత్వం పేత్రునుండి సంక్రమించింది. ఈ పేత్రు ప్రాచీనాధారాల ప్రకారం రోములోనే వేదసాక్షిగా మరణించాడు. ఇక్కడ మనం మొదట నూత్నవేదం నుండి పేత్రు అపోస్తలులందరికీ పెద్ద అనే సత్యాన్ని నిరూపించాలి. తర్వాత పేత్రుకి వారసుడూ రోమాపురి బిషప్పూ ఐన పోపుగారికి ఈ పెద్దరికం సంక్రమించిందని చారిత్రకంగా రుజువు చేయాలి. ఈ రెండంశాలు క్రమంగా చూద్దాం.

1. పేత్రు ప్రధానత్వం

నూత్నవేదం అపోస్తలుల జాబితాలను పేర్కొనేపడల్లా పేత్రు పేరే మొదట వస్తుంది - మార్కు 3,16-19, ఇతర ప్రేషితుల తరపున అతడు మాటలాడుతూంటాడు - మత్త 16,16. ఉత్థాన క్రీస్తు శిష్యులందరిలోను మొదట పేత్రుకే దర్శనమిచ్చాడు - 1కొరి 15,5.