పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/144

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేడు మనం రాతిగుడిని మాత్రమే దేవాలయంగా భావిస్తున్నాం.దివ్యసత్రసాదం దానిలో పదిలపరుస్తున్నాం. దాన్ని సుందరంగా కడుతున్నాం. కాని తొలినాటి క్రైస్తవులు రాతిగుడిని కాక క్రైస్తవ భక్త సమాజాన్నే దేవాలయంగా భావించారు. దైవసాన్నిధ్యాన్ని ప్రధానంగా ఆ సమాజంలోనే చూచారు. మనం మల్లా ఈ సామాజిక దేవాలయం అనే భావానికి రావాలి. ఆత్మద్వారా దైవసాన్నిధ్యం నెలకొని వుండేది ప్రధానంగా క్రైస్తవ సమాజంలోనేనని గుర్తించాలి. అప్పుడే సోదరప్రేమ పెరుగుతుంది. తోడివారిని విలువతోను ఆప్యాయంగాను చూస్తాం.

ప్రార్ధనా భావాలు

1. ఇరెనేయస్ భక్తుడు ఈలా వ్రాసాడు. "తిరుసభ వున్నచోట పవిత్రాత్మ వుంటుంది. e9ég వున్నచోట తిరుసభా, సకల వరప్రసాదాలూ వుంటాయి". కనుక మామూలుగా తిరుసభకు చెందకుండా ఆత్మను పొందలేం.
2. పవిత్రాత్మక్రైస్తవుల్లో ఒక్కొక్కనికి ఒక్కోవరం దయచేస్తుంది. ఈ వరాలతో క్రైస్తవులు తిరుసభకీ, లోకానికంతటికీ సేవలు చేయాలి. తిరుసభలోని అధికారులు విశ్వాసుల వరాలను అణచివేయకూడదు. తిరుసభక్షేమాభివృద్ధికి వాటిని వాడుకోవాలి - 1 తెస్స 5,19-21. ప్రతి క్రైస్తవుడు తన ప్రత్యేక వరాలతో తిరుసభ అభివృద్ధికి పాటుపడాలి.
3. రెండవ శతాబ్దానికి చెందిన గ్రీకు భక్తుడొకడు ఆనాటి సుప్రసిద్ధ వ్యక్తియైన డయెగ్నీటస్కి లేఖవ్రాస్తూ తిరుసభను గూర్చి ఈలా వాకొన్నాడు. "దేహంలో ఆత్మయేలాగో ఈ లోకంలో క్రైస్తవులు ఆలాగు. ఆత్మ దేహంలోని ప్రతి భాగంలోను వుంటుంది. అలాగే క్రైస్తవులు ప్రపంచంలోని భాగాలన్నిటిలోను వసిస్తున్నారు. ఆత్మ దేహంలోనే వసించినా అది దేహానికి సంబంధించినది కాదు. అలాగే క్రైస్తవులు ఈ లోకంలో వసించినా వాళ్లు ఈ లోకానికి చెందినవాళ్ళు కాదు. కంటికి కన్పించే దేహంలో నెలకొనివున్నా ఆత్మ తాను మాత్రం కంటికి కన్పించదు. అట్లే లోకంలోని క్రైస్తవులు కంటికి కన్పిస్తున్నావారి ఆరాధనం ఎవరికీ కన్పించదు. ఆత్మ దేహాన్ని సుఖభోగాలను అనుభవించనీయదు. కనుక శరీరం ఆత్మను హింసిస్తుంది. అదే విధంగా క్రైస్తవులు లోకాన్ని సుఖభోగాలు అనుభవించనీయరు. కనుక లోకం వారిని హింసిస్తుంది. శరీరం తన్నుద్వేషించినా ఆత్మ మాత్రం శరీరాన్ని ప్రేమిస్తుంది.అలాగే క్రైస్తవులు తమ్మ ద్వేషించే ఈ లోకపు ప్రజలను ప్రేమిస్తారు. ఆత్మ దేహంలో