పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3,13. తొలిరోజుల్లో రోమను సమాజంలో క్రైస్తవులకు చాలమంది శత్రువులు వుండేవాళ్ళు సెల్సస్, పార్ఫీరస్, లూష్యస్ మొదలైనవాళ్ల పేర్లు మనకు తెలుసు. వీళ్లంతా సిలువ వేయబడిన క్రీస్తుని ఆరాధిస్తున్నందుకు క్రైస్తవులను ఎగతాళి చేసారు. ఈ నరులు గాడిదను ఆరాధిస్తున్నారని వెక్కిరించారు. సిలువపై చనిపోయినవాడు వివేకహీనుడని వీళ్ళ భావం. ఈలాంటి పరిస్థితుల్లో తొలినాటి క్రైస్తవులు క్రీస్తుని విశ్వసించారు. అతడు నరులకు రక్షకుడని ప్రకటించారు. వాళ్ళు ఆపని ఏలా చేయగలిగారు? తండ్రి మృతక్రీస్తుని ఉత్తానుణ్ణి చేసి అతనికి న్యాయం చేకూర్చి పెట్టాడని నమ్మారు - క్రీస్తు ఉత్థానమే అతడు దైవ భక్తుడనీ లోకరక్షకుడనీ రుజువు చేసింది. తొలినాటి అపోస్తలుల బోధ యిదే. "క్రీస్తు మన పాపాల కొరకు మరణించాడు. మూడవ దినాన అతడు తండ్రిచే సజీవుడుగా లేవనెత్తబడ్డాడు" - 1 కొ 15,3-4. అవమానకరమైన మరణమే అతనికి మహిమగల ఉత్తానాన్ని చేకూర్చి పెట్టింది. ఈ మరణోత్తానాలకు కర్తయైన క్రీస్తుకోసం చనిపోవడానికి గూడ తొలినాటి శిష్యులు వెనుదీయలేదు. సైఫను, తర్వాత పౌలు ఈలాగే వేదసాక్షులుగా మరణించారు.

“మన పాస్క గొర్రెపిల్లమైన క్రీస్తు బలి అయ్యాడు" అని వ్రాసాడు పౌలు - 1 కొరి 5,7. యూదులు పాస్మబలి జరుపుకొనే కాలంలోనే క్రీస్తు మరణికోత్తానాలు సంభవించాయని ఆదిమ క్రైస్తవులకు తెలుసు. ఈజిప్టు పాస్కద్వారా యూదులు బానిసంనుండి స్వేచ్ఛను పొందారు. మరణాన్ని తప్పించుకొని జీవాన్ని పొందారు. పాపాన్ని విడనాడి వరప్రసాదాన్ని పొందారు. తండ్రి క్రీస్తుని మరణంనుండి లేపడంద్వారా కూడ క్రైస్తవులకు ఇవే లాభాలు చేకూరాయి. పౌలు భక్తుడు క్రీస్తు మరణోత్తానాల్లో తండ్రి జ్ఞానాన్ని చూచాడు. నరులపట్ల తండ్రికిగల ప్రేమను చూచాడు. తాను సేవకుడైన క్రీస్తుకి సేవకుడై వేదబోధ చేస్తున్నట్లుగా చెప్పకొన్నాడు. నేను సిలువవేయబడిన క్రీస్తుని బోధిస్తున్నాను అని సగర్వంగా చెప్పకొన్నాడు - 1 కొరి 1,23. అపోస్తలుల వేదబోధ క్రీస్తు పాస్మను ప్రకటించేదే.
ఆ తొలినాటి దైవర్చాన కూడ క్రీస్తు పాస్మను వివరించేదే. యూదులు తమ పాస్మను ఏడాదికి ఒకసారే ఊత్సవంగా జరుపుకొన్నారు. కాని క్రైస్తవులు తమ పాస్మను ప్రతి ఆదివారం జరుపుకొన్నారు. ఈ పాస్కలో యేసు మరణికోత్తానాలే ముఖ్యాంశం. దాన్ని "ప్రభుభోజనం" అన్నారు. అది ప్రభువు మరణికోత్తానాలను జ్ఞప్తికి తెచ్చేది అన్నారు-1 కొరి 11,20. పాస్క విందు క్రైస్తవుల దివ్యసత్ర్పసాద విందుగా మారిపోయింది. యెరూషలేములోని భక్తులు అపోస్తలుల బోధ వినడంలోను, సహవాసంలోను, రొట్టె విరవడంలోను, ప్రార్థనలోను మునిగివుండేవాళ్లు - అచ 2,42. ఈ "రొట్ట విరవడమే” • దివ్యసత్రసాదం. ఉత్తానక్రీస్తు ప్రభావం ఈ శిష్యులమీద బలంగా సోకింది. వాళ్లు ఉమ్మడి