పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీసభలో లోటువల్ల పూజ ఫలితాలు వ్యర్థమై పోతాయని చెప్పాం. ఇక్కడ శ్రీసభ అంటే విశేషంగా పూజను సమర్పించే గురువులు. పవిత్రుడైన గురువు పూజబలినర్పిస్తే ఎంతో ఫలితం పొందుతాం. అపవిత్రుడైన గురువు పూజను సమర్పిస్తే ఆ ఫలితం కొంతవరకు కుంటుపడిపోతుంది. పూజలో విశ్వాసుల భక్తికంటె గూడ గురువుభక్తి ప్రధానంగా గణనీయం. క్రీస్తు ఈ ప్రతినిధి ద్వారా తన్నుతాను తండ్రికి అర్పించుకొంటాడు. ఈ ప్రతినిధి అంతరంగం పవిత్రంగా వుండకపోతే పూజఫలితం తగ్గిపోతుంది.

ప్రార్థనాభావాలు

1. పండ్రెండవ భక్తినాధ పాపుగారు "మేదియాతోర్ధేఇ" అనే శ్రీముఖంలో ఈలా వ్రాసారు. "క్రీస్తు కల్వరి కొండమీద చిందించిన రక్తం ఓ నెత్తురు తొట్టిలాంటిది. అది మనకు పాపపరిహారం చేసి మనకు రక్షణాన్ని ఈయడానికి ఉద్దేశింపబడింది. విశ్వాసులు పూజలో పాల్గొనడం ద్వారా ఈ తొట్టిలో స్నానం చేస్తారు. అప్పుడు వాళ్ళకు పాపపరిహారమూ రక్షణము సిద్ధిస్తుంది." అనగా పూజబలిద్వారా కల్వరి బలి రక్షణం మనకు సంక్రమిస్తుందని భావం. ప్రోటస్టెంటు నాయకులు కల్వరిబలి వేరు పూజబలి వేరు అన్నట్లుగా భావిస్తారు. ఇది పొరపాటు. అవి రెండూ ఒకటే. కల్వరిబలిని నేడు మన మధ్యలో కొనసాగించే సాధనమే పూజబలి.

2. అగస్టీను భక్తుడు కల్వరి బలిని గూర్చి వ్రాస్తూ ఈలా చెప్పాడు. "క్రీస్తు సిలువమీద వ్రేలాడి మనకొరకు తన ప్రాణాలనే అర్పించాడు. అతడు తన నెత్తురు చిందించి మనలను కొన్నాడు. దేవుని ఏకైక కుమారుడు పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఐన క్రీస్తు నెత్తురు ద్వారా మనకు విమోచనం కలిగింది. మనలను కొన్నవాడు క్రీస్తు, అలా కొనడానికి అతడు వెచ్చించిన ధనం అతని సొంత నెత్తురే. అతడు కొన్నది ఈ విశ్వ ప్రపంచాన్నంతటినీ". ఈలాంటి అమూల్యమైన కల్వరిబలిని నేటి మన పూజబలిలో పునశ్చరణం చేస్తాం.

3.క్రీసోస్తం భక్తుడు “గురువు తన కరాలనూ నోటినీ క్రీస్తుకి బదులు ఇస్తాడు" అని పల్మాడు. ఇది చాలా గొప్ప వాక్యం. పూజలో గురువు క్రీస్తుకి ప్రతినిధిగా వుంటాడు. మానవమాత్రుడైన యీ ప్రతినిధిద్వారా క్రీస్తు తన్ను తాను తండ్రికి ఆత్మార్పణం చేసికొంటాడు. గురువు క్రీస్తు ప్రతినిధిగా నిల్చి "ఇది నా శరీరం" అని పల్కినప్పడు తన నోటిని క్రీస్తుకి బదులు ఇస్తాడు. అలాగే దివ్యసత్ర్పసాదాన్ని ఎత్తి చూపించినపుడూ దాన్ని భక్తులకు పంచి యిచ్చినపుడూ అతడు తన చేతులను