పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/272

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐగుపులో ఫరో యిస్రాలీయులను పీడించాడు. ప్రభువు దయతో వాళ్ళకోపు తీసికొని వాళ్ళకు న్యాయం చేకూర్చి పెట్టాడు.

7. అతడు మోషేకు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను తెలియజేసాడు. ఐగుప్తనుండి వెడలి వచ్చేప్పడు యిస్రాయేలీయులకు ఎన్నో అద్భుత కార్యాలు చేసిపెట్టాడు.
8. దేవుని నిర్వచనం కరుణే. అతడు నరులమీద సులభంగా కోపపడడు. వారిని ప్రీతితో ఆదరిస్తాడు. ఈ యెన్మిదవ చరణం నిర్గమకాండం 34, 6-7 నుండి గ్రహింపబడింది. అక్కడ ప్రభువు తన కరుణాగుణాన్ని స్వయంగా మోషేకు వెల్లడి చేసికొన్నాడు. ఈ నిర్గమకాండంలోని వాక్యాలు అతి ప్రశస్తమైనవి. కనుక పూర్వవేదం చాల తావుల్లో వీటిని పేర్కొంటుంది. ఇక్కడ మనకీర్తనకారుడు కూడ వీటిని ఉదాహరించాడు.
9. ఆ ప్రభువు పాపులను శాశ్వతంగా నిరాకరించడు. అతని కోపం ఎంతో కాలం ఉండదు.
10. దేవుడు మన పాపాలకు తగినట్లుగా మనలను శిక్షిస్తే మనమంతా ఈ పాటికి నరకలో కూరుకొనివుండే వాళ్ళమే. అతడు మనలను చూచీచూడనట్లుగా పోనిస్తాడు. కనుకనే మనం బ్రతికి బట్టకట్టి తిరుగుతున్నాం.
11-12. భూమికి ఆకాశం ఎంత యెతో ప్రభువుకి తన భక్తులపట్ల ఉండే ప్రేమ అంత ఉన్నతమైంది. పడమరకు తూర్పు ఎంత దూరమో అతడు మన పాపాలను అంత దూరంగా విసరివేస్తాడు. అనగా మన పాపాలను పూర్తిగా మన్నిస్తాడు. వాటినిక గుర్తుంచుకోడు. భూమికి ఆకాశం, పడమరకు తూర్పు - ఇవి రెండు పూర్వులకు తెలిసిన మహా దూరాలు, భగవంతుని కరుణగూడ ఇంత గొప్పదని భావం. ఇవి రెండు గొప్ప ఉపమానాలు. కవితా హృదయంతో అర్థం చేసికోదగ్గవి, నిత్యం గుర్తుంచుకోదగ్గవి - యెష55, 8-9, కీర్త 36,5.
13. దేవుడు ఓ నాన్నలా, ఓ అమ్మలా మనకు నెనరుజూపుతాడు. అన్ని ప్రేమలకంటె తల్లిదండ్రులకు బిడ్డలపట్ల ఉండే ప్రేమ శ్రేష్టమైంది. భగవంతుల్లో ఈ శ్రేష్టమైన ప్రేమ ఉందని చెప్తున్నాడు. అతన్ని గూర్చి యింతకంటె యొక్కువగా ఏమీ చెప్పలేం.
14. మన తండ్రియైన ఆదాము పిడికెడు మట్టిముద్ద - ఆది 2,7. అతని సంతానానిమైన మనం మట్టి మానుసులం. అనగా దుర్భల ప్రాణులం. చావుకి గురయ్యేవాళ్ళం. సులభంగా పాపానికి వొడిగట్టే వాళ్ళంగూడ, మన స్వభావం తెలిసినవాడు కనుకనే ప్రభువు మనమీద సులభంగా కోపింపడు. పిచ్చుకమీద బ్రహ్మాస్తమా అన్నట్ల " మనలను చూచీచూడనట్లుగా పోనిస్తుంటాడు.