పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/229

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జపించాడు - మత్త 27, 46. ఈలా క్రీస్తుతో సంబంధం కలిగివుండడంవల్ల ఇవి క్రైస్తవ ప్రార్థనలయ్యాయి. మరియమాత క్రీస్తుశిష్యులు వీటిని జపించారు - కొలో 3,17. తొలినాటి వేదసాక్షులు పునీతులు వీటిని ప్రార్థించారు. అగస్టీను మొదలైన పితృపాదులు వీటిపై వ్యాఖ్యలు వ్రాసారు. క్రమేణ యూదులు జపగ్రంథం క్రైస్తవులకుగూడ జపగ్రంథమైంది. ప్రాచీన క్రైస్తవుల ప్రార్థనా గ్రంథాల్లో అధికభాగం కీర్తనలే ఉండేవి. నేడు గురువులు మఠకన్యలు జపించే డివైన్ ఆఫీసులో అధికశాతం ప్రార్థనలు కీర్తనలే. పూజబలి ప్రార్థనల్లో గూడ చాల కీర్తనలు వస్తాయి.

కీర్తనల గ్రంథానికి క్రైస్తవులు ఇంత ప్రాముఖ్యం ఈయడం దేనికి? ఆ గీతాల్లోని భక్తిభావాలను బట్టే అవి దేవునికీ నరునికీ మధ్యనడచిన పవిత్ర సంభాషణలు. తరతరాల పొడుగునా నరులు భగవంతునిపట్ల చూపుతూ వచ్చిన వివిధ భక్తిభావాలు ఈ కీర్తనల్లో ఎక్కడో వోతావులో కన్పిస్తూనే వుంటాయి. కనుక క్రైస్తవ భక్తులు ఈ గీతాలతో పరిచయం కలిగించుకొని వీటిని తమ ప్రార్థనల్లో తరచుగా వాడుకొంటూండాలి.

కీర్తనలను భక్తితో జపించడానికి నియమం ఇది. ఏదైనా వో కీర్తనను జపించేప్పడు దాని రచయిత భక్తిభావాన్ని మన భక్తిభావం చేసికోవాలి. అగస్టీను భక్తుని మాటల్లో చెప్పాలంటే "కీర్తనకారుడు జపిస్తే మనమూ జపించాలి. అతడు దుఃఖిస్తే మనమూ దుఃఖించాలి. అతడు సంతోషిస్తే మనమూ సంతోషించాలి. అతడు దేవుణ్ణి నమ్మితే మనమూ నమ్మాలి, అతడు భయాన్ని వ్యక్తంచేస్తే మనమూ భయాన్ని వ్యక్తం చేయాలి". ఈ యగస్టీనే భోజనాన్ని నోటితో రుచిచూస్తాం, కీర్తననైతే హృదయంతో రుచిచూస్తాం అన్నాడు. తేనె తేనెపట్టులో దొరుకుతుంది, భక్తిమాధుర్యం పవిత్ర గీతాల్లో దొరుకుతుంది అని వాకొన్నాడు బెర్నార్డ్ భక్తుడు. క్రైస్తవులు కీర్తనలు జపించినపుడెల్లా వాళ్ళ హృదయాలు పవిత్రాత్మ చేతుల్లో వీణలాంటి మోతాయని నుడివాడు ఎఫేము భక్తుడు. కనుక ఈ గీతాలను మనం తరచుగా ప్రార్థన చేసికొంటూండాలి.

8. వర్గీకరణం

కీర్తనలను వాటిల్లో కన్పించే రచనావిధానాన్ని బట్టీ, ఇతివృత్తాన్నిబట్టీ రెండు రకాలుగా విభజించారు.

మొదట, రచనా విధానాన్నిబట్టి వాటిని మూడు వర్గాలుగా విభజించారు. అవి 1. Hymns — స్తుతిగీతాలు 2.snpplications(laments)_ విలాపగీతాలు 3. thanksgivings_కృతొఞతా గీతాలు