పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/205

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావిస్తారు. అసలు వీళ్లు పాపమంటే ఏవోకొన్ని ఆజ్ఞలను విూరడమనుకొంటారేగాని, తండ్రిలాంటి దేవునితో వుండే ప్రేమ సంబంధాన్ని తెంచుకోవడం అని భావించరు.

మన ప్రజల్లో కొందరు చావైన పాపం లేకపోయినా సరే సత్ర్పసాదాన్ని స్వీకరింపకముందు పాపోచ్చారణం చేయాలని అనుకొంటారు. కాని కొందరు దీనికి కేవలం వ్యతిరేకదోరణిలో ఆలోచిస్తారు. వీళ్ళు ఎప్పడూ సత్ప్రసాదం స్వీకరిస్తూనే వుంటారు. కాని పాపోచ్చారణం మాత్రం పట్టించుకోరు. ఇవి రెండూ తప్పుడు పద్ధతులే.

పాపోచ్చారణంద్వారా పూర్తిగా పరివర్తనం చెందలేకపోతూంటాం. ఇంకా మన పాపాలద్వారా ఎవరికి కష్టమూనష్టమూ కలిగించామో ఆ తోడి ప్రజలతో మళ్ళా సమాధానపడలేక పోతూంటాం. ఇందువల్ల గూడ కొందరికి ఈ సంస్కారంపట్ల నమ్మకం తొలగిపోతూంది. ఇదేమో సులువుగా పాపాలను వదిలించుకొనే తంతులావుందే అని వీళ్ళ దీనిపట్ల విశ్వాసం కోల్పోతూన్నారు. అసలు దీనివల్ల ఫలితం దక్కదేమోనని అనుమానపడుతూన్నారు.

పూర్వమే చెప్పినట్లు ఆధునికయుగం పాపభీతి కోల్పోయింది. తిని త్రాగి లైంగిక సుఖాలు అనుభవించడం, ఒకరితో ఒకరు పోటీకి దిగడం, పేదల నోళ్లుగొట్టి అన్యాయంగా సొమ్ము జేసికోవడం మొదలైనవి నేటి మానవునికి ప్రీతికరమైన చర్యలు. ఈలాంటి నాగరికతకు అలవాటుపడిన క్రైస్తవులు చాలమంది పాపాన్ని లెక్కచేయరు. పాపాన్ని లెక్కచేయని క్రైస్తవుడు పాపోచ్చారణాన్ని మాత్రం ఎందుకు పట్టించుకొంటాడు? ఇంకా ఇటీవలి కాలంలో కొందరు గురువులకి పాపోచ్చారణం చేయడం అవసరమా అనే శంకను వెలిబుచ్చుతూ వచ్చారు. వీళ్ళనుజూచి భక్తిగల క్రైస్తవులుకూడ ఈ పుణ్యకార్యాన్ని అశ్రద్ధ చేయడం మొదలెట్టారు. ఇన్నికారణాలవల్ల ఈ సంస్కారం నేడు అనాదరణకు గురవుతుంది.

ఫలితంగా నేడు చాలమందికి పాపోచ్చారణంపట్ల భక్తి సన్నగిల్లిపోయింది. కొందరు దాన్ని యాంత్రికంగా పాపాలను పరిహరించే తంతు అని భావిస్తుంటే, మరికొందరు అది శక్తిని కోల్పోయిన, అనవసరమైన సంస్కారం అని యెంచుతూన్నారు. కాని యివన్నీ తప్పడు భావాలేనని ముందే వివరించి చెప్పాం. పాపం ఘోరమేంది. దేవునికి యెంతో అప్రియం కలిగించేది. దాన్ని వదిలించుకోవాలంటే భక్తిగల పాపోచ్చారణం అవసరం. ఈ సంస్కారం వ్యక్తిగతమైందీ, సామూహికమైందీ గూడ. దీనిద్వారా మనం దేవునితోను తోడిప్రజలతోను గూడ రాజీపడతాం. ఇది దేవుని యెదుట చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడ్డంద్వారా పనిచేస్తుందేగాని యాంత్రికంగా పనిచేయదు. ఈ సంస్కారం తొలినాళ్ళనుండి శ్రీసభలో వాడుకలో వుందని చెప్పాం. నేడు మనం దాన్ని అపార్థంచేసికొని అశ్రద్ధ చేస్తున్నామంటే తప్ప మనదే. ఇవి నిర్దుష్టమైన భావాలు. ఈలాంటి భావాలద్వారా