పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/164

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుదుర్చుకోవాలని హెచ్చరించారు. ఈలాగే పాపులమైన మనం కూడ ప్రభువు సన్నిధిలోకి వెళ్ళి అతనితో రాజీ కుదుర్చుకోవాలి.

మూడవది, దైవరాజ్యాన్ని పొందాలని కోరుకోవడం, క్రీస్తు తండ్రి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. కనుక మనం ఈ లోకరాజ్యాన్ని పిశాచరాజ్యాన్నీ వదలుకొని క్రీస్తు రాజ్యాన్నిస్వీకరించాలి. క్రీస్తురాజ్యం ప్రధానంగా మన హృదయంలో నెలకొంటుంది. ఆ క్రీస్తుని మన హృదయ సింహాసనం విూద ఆసీనుడ్డి చేసికోవాలి. దైవరాజ్యం పూర్తిగా లోకాంతంలో గాని సిద్ధింపదు. కాని మనం ఇప్పటినుండే ఆ రాజ్యాన్ని మన హృదయంలో నెలకొల్పుకొనే ప్రయత్నం చేయాలి.

ఈలా పాపాన్ని విడనాడాలనీ, దేవుని దగ్గరికి తిరిగి రావాలనీ, దైవరాజ్యాన్ని పొందాలనీ కోరుకోవడమే పరివర్తనం చెందడమౌతుంది.

2. పరివర్తనం కేవలం మన కృషి మాత్రమే కాదు

పరివర్తనమనేది కేవలం మన కృషివల్ల సిద్ధించేది మాత్రమే కాదు. అది ప్రభువు దయచేసే వరం కూడ, వరప్రసాద ఫలితం కూడ, ప్రవక్తల బోధల ప్రకారం పరివర్తనమంటే నూత్న హృదయాన్ని పొందడం. అనగా మన వ్యక్తిత్వమూ ఆలోచనలూ అభిలాషలూ క్రియలూ నైతిక జీవితమూ అన్నీ కూడ మంచికి మారడం. ప్రభువు పూర్వపు పాపహృదయాన్ని తొలగించి క్రొత్త హృదయాన్ని ప్రసాదించటం వల్ల మనకు ఈ నూత్నత్వం సిద్ధిస్తుంది - యెహె 36,26. పౌలు కూడ పరివర్తనాన్ని క్రొత్తపట్టువు అనీ క్రొత్తసృష్టి అనీ పేర్కొన్నాడు. ఎవడైనా క్రీస్తులో వుంటే అతడు నూత్న సృష్టి ఔతాడు. ఇక పాపజీవితం నశించి క్రొత్త జీవితం నెలకొంటుంది - 2కొరి 5, 17. కాని అది మన కృషి ద్వారా కాక దేవుని వరప్రసాదం ద్వారా లభించే భాగ్యం. అసలు పశ్చాత్తాపపడాలనే కోరిక కూడ వరప్రసాదం వల్లనే లభిస్తుంది.

ఐనా దేవుడు ఎప్పడు మన సహకారాన్నిగూడ అర్ధిస్తాడు. కనుక పాపోచ్చారణ సంస్కారంలో నరునికృషి చాల వుంది. పశ్చాత్తాపం, పాపోచ్చారణం, ప్రాయశ్చిత్తం అనే మూడు క్రియలు ఈ సంస్కారంలో మనం దేవునికి అర్పించేవి. వీటిని గూర్చి రాబోయే అధ్యాయాల్లో విపులంగా పరిశీలిస్తాం. ఈ మూడు క్రియలకు గురువు చెప్పే క్షమాపణ ప్రార్థనను చేర్చగా ఈ సంస్కారం పూర్తవుతుంది. ఈ క్షమాపణం గురువు ద్వారా దేవుడే యిస్తాడు. ఈవిధంగా నరుని కృషీ భగవంతుని క్షమాభిక్షా రెండూ కలసి పాపోచ్చారణ సంస్కారాన్ని ఫలభరితం చేస్తాయి. కనుక పాపోచ్చారణ మనేది కేవలం యాంత్రికమైన