పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/239

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పౌలుకి శత్రువులయ్యారు, వాళ్లు అతని బోధక అంతరాయం కలిగించేవాళ్లు, అతన్ని హింసించేవాళ్ల వాళ్లు తన్నుపెట్టే బాధలను గూడ పౌలు పై "మల్ల" శబ్దంతో సూచించాడు.

ఇక, పౌలు ఈ ముల్లని తొలిగించమని ప్రభువుని మూడు సార్లు మనవి చేసాడు. అనగా అతడు దాన్ని ఫరోరశ్రమగా భావించాడనుకోవాలి. కాని ప్రభువు మాత్రం ఆ మల్లని తొలగించలేదు. నా కృప నీకు చాలుపో అన్నాడు. నీవు బలహీనుడవై వున్నప్పడు నా శక్తి నీ మీద బలంగా పని చేస్తుంది மூ&) చెప్పాడు. పౌలుకి విషయం అర్థమయింది. తాను బలహీనుడుగా వున్నప్పడు, తన సొంత బలం తనకు చాలనపుడు, వినయంతో ప్రభువుని ఆశ్రయిస్తాడు. అప్పడు దైవబలం అతనిమీద పనిచేసి విజయాన్ని సాధించిపెడుతుంది, కాని అతడు నేను బలవంతుణ్ణి అనుకొన్నపుడు, తన బలం మీద తాను ఆధారపడినప్పడు, గర్వంతో పొంగిపోతాడు. అప్పడు దైవబలం అతనికి సహాయపడదు. కనుక ఓడిపోతాడు. కావున అతడు బలహీనుడుగానే వుండగోరాడు. నేను ఎప్పడు బలహీనుణ్ణి అప్పడే దైవబలం పొంది బలవంతుణ్ణి ఔతాను అనుకొన్నాడు. అందుచేత ఆ ముల్లని తొలగించమని అతడు మల్లా ప్రభువుని అడగనేలేదు. ఏ బలహీనతను తలంచుకొని పౌలు భయపడిపోయాడో ఆ బలహీనతలోనే శక్తి యిమిడి వుండడం ఆశ్చర్యంకదా!

2.పౌలు బలహీనతలు పై ముల్ల ఉదంతాన్ని పేర్కొనక ముందు పౌలు చాలా బలహీనతలను చవిజూచాడు. వాటిల్లో కొన్నిటిని పరిశీలిద్దాం. అది అతని రెండవ ప్రేషిత ప్రయాణం. ఫిలిప్పి నగరంలో దయ్యం పట్టిన బానిసపిల్ల వుండేది. ఆమె సోదె చెప్పి యజమానులకు డబ్బు గణించి పెట్టేది . పౌలు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. తమ ఆదాయం పోయినందుకు ఆ యజమానులు మండిపడి, పౌలుని అతని శిష్యుడు పీలని కొరడాలతో కొట్టించారు, చెరలో త్రోయించారు. అప్పడు పౌలుకి తన బలహీనత అనుభవానికి వచ్చింది - అకా 16, 16-24.

తరువాత అతడు తెస్సలోనిక నగరానికి వచ్చి అక్కడ క్రీస్తే మెస్సియా అని బోధించడం మొదలెట్టాడు. కాని ఆ నగరంలోని యూదులు పౌలు బోధకు అసూయ చెందారు. గూండాలను తీసికొనివచ్చి అతన్ని ముప్పతిప్పలు పెట్టారు. పౌలుకి ఆశ్రయమిచ్చిన యాసోనుని చెరలో త్రోయించారు, పౌలుకి తన ఆశక్తకత అనుభవానికి వచ్చింది - అచ 17, 1-9.

అక్కడినుండి అతడు బెరియాకు వెళ్ళాడు. అక్కడ బోధ చేయగా చాలమంది క్రీస్తుని విశ్వసించారు. ఉన్నత కుటుంబాలవాళ్ళు కూడ శిష్యులయ్యారు. ఈ సంగతి తెలిసికొని తెస్సలోనికా యూదులు మళ్ళా అక్కడికి వచ్చిపడ్డారు. పౌరులను రెచ్చగొట్టి కలకలం సృష్టించారు. పౌలుకి తన చేతగానితనం అనుభవానికి వచ్చింది - అచ 17, 10-13.