పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/201

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. నీవు ప్రస్తుత లైంగికయుగ ప్రభావానికి సులభంగా లొంగిపోతుంటావా లేక దైవభక్తితో ఆ ప్రభావాన్ని ఎదిరించి నిలుస్తూంటావా?
4. సినిమాలు, టీవీలు, సెక్సుసాహిత్యం, చెడుస్నేహాలు మొదలైన వాటి ద్వారా అనవసరంగా నిన్ను నీవు ఉద్రేకపరచుకోవు గదా?
5. లైంగిక వాంఛలకు సంబంధించినంత వరకు నీ హృదయంలోని కోర్మెలు ఏలా వుంటాయి? నీవు కామసంబంధమైన పగటికలలు కంటూంటావా?
6. నీవు నేత్రవినీతిని పాటించడం, కామేచ్ఛతోగూడిన స్పర్శకు దూరంగా వుండడం మొదలైన విషయాల్లో జాగ్రత్తగా వుంటూంటావా?
7. భిన్నలింగం గల వ్యక్తులతో మెలిగేప్పడు నీ చూపులు నిర్మలంగా వుంటాయా? నీ మాటల్లో ద్వంద్వార్ణాలు వుండవు కదా? నీవు పాపపు సరసాలకు దిగవుక్తం?
8. ఏ పురుషుని విూదనైనా, లేక ఏ స్త్రీ విూదనైనా నీకు అక్రమమైన లైంగికవాంఛ వందా?
9. తాజెడిన కోతి వనమెల్ల చెరిచింది అన్నట్లుగా నీవు చెడింది చాలక నీ స్నేహితులను గూడ చెడగొట్టడం లేదు కదా?
10. దేవమాతపట్ల భక్తి చూపితే ఆ తల్లి మనలను కామవాంఛల నుండి కాపాడుతుంది. ఈ యనుభవం నీకేమైనా వుందా?

6. సోమరితనం

1. సోమరితనం అంటే యేమిటి?

పనిపాటలు లేకుండా వుండిపోవడమే సోమరితనం. సోమరితనమనేది మొదట మనసులో వుంటుంది. ఆ విూదట క్రియల్లోకి ప్రవేశిస్తుంది. అనగా మనం మొదట పని మాని వేయాలని కోరుకొంటాం. తర్వాత, కోరుకొన్నట్లుగానే మానివేస్తాం. సోమరిపోతులు శ్రమను తప్పించుకొని తిరుగుతారు. పరాన్నభుక్కుల్లాగ ఇతరులమిూద ఆధారపడి జీవిస్తారు. సోమరితనంలోగూడ హెచ్చుతగ్గులుంటాయి, కొందరు అసలు పనిని చేపట్టనే చేపట్టరు. మరికొందరు పనిని చేపడతారు గాని దాన్ని ముగించరు. ఇంకా కొందరు వనిని ముగిస్తారు. కాని దాన్ని సంతృప్తికరంగా ముగించరు. పాలుమాలిక భౌతికరంగంలోను వుంటుంది. ఆధ్యాత్మికరంగంలోను వుంటుంది.

2. సోమరితనంలోని దుష్టత్వం

నరుడు కష్టపడి పనిజేయాలన్నది దైవశాసనం. తొలి మానవుడైన ఆదాము తోటలో పనిచేయవలసి వచ్చింది. ఏదెను తోటను సాగుచేయడానికీ కాపాడ్డానికీ ప్రభువు 193