పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/156

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. ఆత్మ ఒకటుందనే మాకు తెలీదు - అ,చ, 19,2.

ప్రభువు పితయొద్దనుండి ఆత్మను పొందాడన్నాం, తాను పొందిన ఆత్మనే జ్ఞానస్నాన సమయంలో మనకూ ప్రసాదిస్తాడన్నాం. ఈ విషయాన్ని మనమట్టే జ్ఞాపక మంచుకోం. ఓ మారు పౌలు ఎఫేసు పట్టణానికి వెళ్లాడు. అక్కడ స్నాపక యోహాను శిష్యులు కొందరు ఉండేవాళ్లు. వాళ్లు యోహాను వద్దనే జ్ఞానస్నానం పొందారు. పౌలు వాళ్లను చూచి "మీరు పరిశుద్ధాత్మను పొందారా" అని అడిగాడు. "ఎవరాయాత్మ? అసలు పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఒకడున్నాడనే మాకు తెలీదే" అన్నారు వాళ్లు. వెంటనే పౌలు వాళ్లకు క్రీస్తు పేరట జ్ఞానస్నానం ఇచ్చాడు. వాళ్లమీద చేతులు చూచాడు. తత్ క్షణమే ఆత్మ వాళ్ల మీదికి దిగివచ్చింది.

మనప్రవర్తనంగూడ ఈ యొఫెసీయుల్లాగే వుంటుంది. ఆత్మ ఒకటుందనే మనకు రూఢిగా తెలియదు. సరే, ఆత్మ ఒక టుందనుకున్నాం. కాని ఈ యాత్మ యెవరు? ఏం చేస్తుంది? క్రిందరాబోయే అంశాల్లో ఈ ప్రశ్నలకు జవాబులను విచారించి చూద్దాం.

11. ఆత్మ ఓ ముద్ర లాంటిది - ఎఫే 1, 13-14

జ్ఞానస్నానం పొందినపుడే ఆత్మ మన హృదయాల్లోనికి ప్రవేశిస్తుంది. ఆలాప్రవేశించి మనహృదయంమీద ఓ ముద్రవేస్తుంది. పౌలు ఉద్దేశం ప్రకారం ఈ ముద్రకు మూడు భావాలున్నాయి.

1) అతని నాటి గ్రీకు రోమను సమాజాల్లో బానిసలమీద యజమానులు ముద్ర వేసేవాళ్లు. సైనికుల మీద రాజులు ముద్ర వేసేవాళ్లు. అనగా ఆ బానిసలు సైనికులు, యజమానులకు రాజులకు చెందినవాళ్లన్నమాట. ఈ లాగే మనం గూడ జ్ఞానస్నానం పొందాక ప్రాత యజమానుడైన పిశాచాన్ని విడనాడి క్రొత్త యజమానుడైన క్రీస్తును సేవిస్తాం. ఆలా సేవిస్తా మనడానికి ఈ ముద్ర గురుతు. 

2) నాటి సమాజంలోని భక్తులు భక్తురాళ్ళ దేవతలకు తమ్ముతాము అర్పించుకునేవాళ్ళు ఆ దేవతలకే పూర్తిగా చెందిపొయ్యేవాళ్ళ ఆ దేవతలనే సేవించే వాళ్ళు. ఇప్పడు, ఈ ముద్ర పొందాక క్రైస్తవుడు కూడ క్రీస్తుకే అంకితమౌతాడు, క్రీస్తునే సేవిస్తాడు అని సూచింపబడింది.

3) ఈ ముద్ర రాబోయే మోక్ష మహిమకు గూడ చిహ్నం, క్రయవిక్రయాల్లో ముందుగా బయానా చెల్లిస్తాం. ఈ బయానా ముందు రాబొయ్యే డబ్బునకు చిహ్నంగా వుంటుంది. మన హృదయంలోని పరిశుద్దాత్మ అనే ముద్ర కూడ పిత మనకిచ్చిన ఓ బయానా లాంటిది. మనకు లభింపబోయే సొమ్ము మోక్షం. ఈ ముద్ర ద్వారా మోక్ష