పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/106

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలవడుతుంది. వాళ్లు ఎప్పటికప్పుడు తమ పాపాలను అర్థంచేసికొని పశ్చాత్తాపపడి ప్రభువు మన్నింపు పొందుతుంటారు. ఈ పరివర్తనం ద్వారా వాళ్ళకు చిత్తశాంతీ ఆంతరంగికమైన స్వాతంత్ర్యమూ లభిస్తుంది. ప్రభువు ఆత్మ వుండేకాడ స్వాతంత్ర్యం వుండితీరుతుంది-2 కొ 3,17. ఆంతరంగికమైన సంతోషమూ శక్తి కూడ లభిస్తాయి గల- 5,22.

5. ప్రభువు మన రోగాలను కుదిర్చేవాడు

1. ప్రభువు మన వ్యాధులను నయం జేసేవాడు, ఆనాడు అతడు జనబాహుళ్యాన్ని చూచి జూలిపడి వాళ్ళ వ్యాధులను స్వస్థపరచాడు - మత్త 1, 14. యెషయా ప్రవక్త మెస్సీయాను గూర్చి "ఆయన మన బాధలన్నీ పోగొట్టాడు. మన వ్యాధులన్నీ తానే మోసికొనిపోయాడు" అని చెప్పాడు. మత్తయి ఈ వాక్యాన్ని క్రీస్తుకి అన్వయింప జేసాడు - 8, 17.

2. వ్యాధిగ్రస్తులను నయంజేసేనే శక్తి ప్రభువు నుండి శిష్యులకు సంక్రమించింది. పేత్రు క్రీస్తు నుండి పరలోక రాజ్యపు తాళపుచెవులను పొందాడు. అనగా క్రీస్తు నుండి సర్యాధికారమూ పొందాడు. - మత్త 16,19. క్రీస్తును విశ్వసించే శిష్యులు అతడు చేసిన అద్భుత క్రియలన్నీ చేయగలరు - యోహా 14, 12. తొలినాటి శిష్యులు క్రీస్తు పేరుమీదిగా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచారు – అచ 4,30.

3. పెంతెకోస్తు ఉద్యమంలో భక్తుల వ్యాధిబాధలు నయం కావడం కద్దు. మన వ్యాధిబాధలన్నీ నాలురకాలుగా వుంటాయి. ప్రభుని విశ్వసించినవాళ్లకి ఈ నాలురకాల రోగాలూ నయమాతూనేవుంటాయి.

1) ఆధ్యాత్మికమైన వ్యాధి : ఈ వ్యాధి మనదేహానికి కాక ఆత్మకు సంబంధించింది, దానికి కారణం మన పాపం. ఈ వ్యాధిని తొలగించడానికి తిరుసభ నిర్ణయించిన మార్గం పాపసంకీర్తనం. ఈ వుద్యమం అనుసరించే మార్గం పశ్చాత్తాపం. పాపవ్యాధిని నయం జేయడానికి సహజమైన మార్గమేమీలేదు.
2) మనోభావాలకు సంబంధించిన వ్యాధి : దీనివలన మనం తోడిజనంతో ఒద్దికగా మెలగం. కోపతాపాలకు గురౌతాం. ఇతరులతో సంబంధబాంధవ్యాలు తెంచుకొంటాం. ఈ వ్యాధికి కారణం జన్మపాపం. ఈ వ్యాధిని తొలిగించడానికి తిరుసభ నిర్ణయించిన మార్గం పాపసంకీర్తనమూ దివ్యసత్రసాదమూ అనే సంస్కారాలు. ఈ ఉద్యమం అనుసరించే మార్గం, వ్యాధిగ్రస్తులకు అంతరంగికమైన హృదయారోగ్యం చేకూరడానికై ప్రార్థన చేయడం.