పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/103

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22. అన్ని రోగాలనూ కుదిర్చే ప్రధాన ఔషధం ప్రేమ. కనుక అన్నింటికంటె పైగా ప్రభువు ఈ ప్రేమౌషధాన్ని మనకు ప్రసాదిస్తాడు.

3. ప్రభువు ప్రేమ మనప్రేమలా చపలమైంది కాదు, నిలకడకలది. అతనిది శాశ్వతమైన ప్రేమ. కనుకనే ప్రభువు "నేను మిమ్మ శాశ్వత ప్రేమతో ప్రేమించాను" అన్నాడు - యిర్మీ 31,3. ప్రవక్త యెషయా ప్రభువు ప్రేమనుతల్లి ప్రేమతో పోల్చాడు, "తల్లి ప్రేగున బుట్టిన బిడ్డను మరచిపోతుందా? తన శిశువును ప్రేమించకుండా వుంటుందా? ఒకవేళ తల్లితాను కనిన బిడ్డను మరచిపోతే పోతుందేమోకాని నేను మాత్రం మిమ్మ మరచిపోను" - 49,15. ఇదే ప్రవక్త ప్రభువు ప్రేమను భర్త భార్యపట్ల చూపే ప్రేమతో గూడ పోల్చాడు. “నిన్ను సృజించిన ప్రభువే నీభర్త, సర్వశక్తిమంతుడని ఆయనకు పేరు. భర్తవలన పరిత్యక్తయై దుఃఖాక్రాంతురాలైన పడుచు భార్యను ఆ భర్తవలె ప్రభువునిన్ను మరల చేపడతాడు" - 54, 5-6. ఆ ప్రభువు మనకు దాపులోనే వుండి మనలను ఆదరిస్తుంటాడు. మనలను పేరెత్తి పిలిచి అభయ మిస్తుంటాడు. "మీరు లోతైన నీళ్లను దాటిపోయేపుడు నేను మీతోవుంటాను. మీ బాధలు మిమ్మ క్రుంగదీయలేవు, మీరు నిప్ప మంటలగుండా నడచిపోయేపుడు ఆ మంటలు మిమ్మ కాల్చివేయలేవు. మీకు అడ్డువచ్చే యాతనలు మిమ్ము బాధించలేవు. నేను మిమ్ము తప్పక రక్షిస్తాను" - 43,2. ఆ ప్రభువుకి మనం బాగాతెలుసు. అతడు మన పేరును తన చేతిమీద పచ్చ పోడిపించుకొంటాడు - 49, 16- ఎందుకు? మనలను గుర్తుంచుకొనేందుకు. ఆప్రభువు పేమ మన రోగాలను తొలగించేదిగూడ, “నేను చెదరిపోయిన గొర్రెలను వెదుకుతాను. మంద నుండి తొలగిపోయినవాటిని మల్లా తోలుకొనివస్తాను. గాయపడినవాటికి కట్టు కడతాను. జబ్బుగా నున్నవాటికి రోగం నయం జేస్తాను." - యెహెజ్కేలు34, 16. భగవంతుడు మన పట్ల చూపే ప్రేమలో ఇన్ని సదుణాలున్నాయి.

4. అనాదినుండీ అన్ని మతాలవాళ్లూ భగవంతుని ఆశిస్తూనేవచ్చారు. కాని ఈ మతాల్లో భక్తుడే భగవంతుని వెదకాడు. ఐనా మానవ ప్రయత్నంవల్ల భగవంతుడు లభ్యంకాడు. అందుకే బైబులు మతంలో దేవుడే నరుడ్డి వెదక్కుంటూ వచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు. అతనిద్వారా నరులు నిత్యజీవం పొందుతారు. - యోహా 3,16

5. పవిత్రాత్మ ఉద్యమం నరులు దేవుని ప్రేమను గుర్తించేలా చేస్తుంది. క్రీస్తుద్వారా మనం పరిశుద్దాత్మను అధికాధికంగా పొందేలా చేస్తుంది. ఆ ప్రభువు మనకు పరిశుద్దాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానమిస్తాడు - మత్త 3, -11. ఈలా క్రీస్తుద్వారా