పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/51

ఈ పుట ఆమోదించబడ్డది

జరుగూతున్నపుడు మోషే కోడెలనెత్తురు ప్రజలమీదా పీఠంమీదా చిలకరించాడు. ఆ క్రియద్వారా ప్రజల హృదయాలు శుద్ధి చెందాయి. అక్కడ పీఠం దేవునికి గుర్తు, నెత్తురు ప్రాణానికి గుర్తు. ఈ చిలకరింపుద్వారా ప్రజల హృదయాలు శుద్ధిని పొంది దేవునితో ఐక్యమయ్యాయని సూచింపబడింది - నిర్గ 21,8.

ఇక న్నూతవేదంలో క్రీస్తు నెత్తురుకూడ పై కార్యాలన్నీ చేస్తుంది. ఆ ప్రభువు చిందించిన నెత్తురుద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది. మన హృదయాలు శుద్ధిచెంది దేవునితో ఐక్యమయ్యాయి. పూర్వవేదంలో పొట్టేళ్ళ నెత్తురూ కోడెదూడల నెత్తురూ ప్రజల హృదయాలను శుద్ధిచేస్తే, నూత్నవేదంలో నిర్దోషియైన క్రీస్తు నెత్తురు మనలను ఇంకా యెంత ఎక్కువగా శుద్ధిచేస్తుందో ఊహించు కొమ్మన్నాడు హెబ్రేయుల లేఖాకారుడు - 9, 13-14

5. తండ్రితో రాజీ తొలి మానవుడు పాపంద్వారా దేవునికి శత్రువయ్యాడు. ఈ శత్రుత్వం అతని సంతతియైన మానవజాతి కంతటికీ సంక్రమించింది. నరులందరూ దేవునికి విరోధులయ్యారు. ఈ విరోధాన్ని తొలగించి దేవునితో మనకు మళ్ళా మైత్రి చేకూర్చినవాడు క్రీస్తు. మనం దేవునికి శత్రువులమై యుండగా క్రీస్తు మరణంద్వారా దేవునితో మనకు మళ్ళా రాజీ యేర్పడింది - రోమా 5,10. దేవుని యింటి నుండి వెడలిపోయిన నరుడు క్రీస్తు మరణంద్వారా మళ్ళా దేవుని యింటిలో అడుగు పెట్టాడు. దుడుకు చిన్నవాడిలాగ, తప్పిపోయిన గొర్రెలాగ, పాపపు నరుడు మళ్ళా తండ్రి యింటిని చేరుకున్నాడు. క్రీస్తుతోకూడి మనం మళ్ళా దేవుని కుమారులం అనిపించుకున్నాం.

6. ప్రాత నరుని సిలువ వేయడం, క్రీస్తు భౌతిక నరుడుగా చనిపోయి ఆధ్యాత్మిక నరుడుగా ఉత్థానమయ్యాడు. ఈ ఉత్థాన క్రీస్తులోకే మనం జ్ఞానస్నానం పొందేది. ఈ జ్ఞానస్నానం ద్వారా మనం పాపానికి చనిపోయి వరప్రసాదానికి ఉత్థానమౌతామని చెప్పాం, జ్ఞానస్నానంతో మనలోని పాతనరుడు, అనగా పాపపు నరుడు, సిలువ వేయబడతాడు - రోమా 6,6. అనగా మనకు పాపపరిహారం జరుగుతుంది. ఇకమీదట మనం నూతన జీవితం జీవిస్తాం, క్రీస్తుని ధరిస్తాం - రోమా 13, 14 ఇదంతా క్రీస్తు సిలువ మరణం ద్వారా లభించిన భాగ్యం.

7. పిశాచంమీద విజయం. పిశాచం చెట్టుమీద వుండి తొలినరుణ్ణి జయించింది. క్రీస్తుకూడ మళ్ళా చెట్టుమీద వుండే పిశాచాన్ని జయించాడు. "దేవుడు తన సొంత కుమారుని శరీరధారినిగా పంపి శరీరమందే పాపానికి శిక్ష విధించాడు" అన్నాడు పౌలు - రోమా 8,3, છઠ భావగర్భితమైన వాక్యం. పూర్వం పిశాచం దేహధారియైన ఆదామునందు తన