పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

దిగిపోయాడు. ఆ మరణం క్రీస్తు అనురాగానికి గూడ నిదర్శనంగా వుంటుంది. సిలువ మరణం తండ్రికీ క్రీస్తుకీ మనపట్ల ఎంత ప్రేమవ్ఛందో నిరూపిస్తుంది. మనంకూడ ఆ తండ్రి కుమారులకు బదులు ప్రేమ చూపాలని ఉద్గోషిస్తుంది.

4 క్రీస్తు పాతాళసందర్శనం

క్రీస్తు మరణించి సమాధిలో వంచబడిన పిదప పాతాళానికి దిగిపోయాడు. 1 పేత్రు 3,18–22 ఈ సంఘటనాన్ని పేర్కొంటుంది. ఈ వేదవాక్యాల ప్రకారం, క్రీస్తు పాతాళానికి వెళ్ళి అక్కడ చెరలోవున్న ఆత్మలకు బోధ చేసాడు. ఆ యాత్మలు దేవుణ్ణి విధేయించనివీ, అతని సహనాన్ని పరీక్షించేవీని. క్రీస్తు పాతాళంనుండి వెలుపలికివచ్చి పునరుత్తానుడై దేవుని కుడిపార్వాన్ని చేరుకొన్నాడు.


ఈ వేదవాక్యాలకు వేదపండితులు వివిధార్థాలు చెపూ వచ్చారు. ప్రాచీన పండితులు చెప్పిన అర్థమిది. క్రీస్తు పాతాళానికి వెళ్ళి నోవా మొదలైన పూర్వవేద పితరులకు రక్షణాన్ని బోధించాడు. తన వృత్తానంద్వారా వాళ్ళను పాతాళంనుండి విడిపించి మోక్షానికి తీసికొనివెళ్ళాడు. మూసిన మోక్షాన్ని మళ్ళా తెరచాడు. కనుక క్రీస్తు ఇక్కడ ఓ ప్రత్యేక రక్షణకార్యం నిర్వహించాడు.

కాని ఆధునిక పండితులు పై వాక్యాలకు మరో అర్థం చెప్తున్నారు. క్రీస్తు పాతాళానికి వెళ్ళింది పూర్వవేద పితరులకు బోధ చేయడానికి కాదు. అక్కడ వసించే పిశాచాలను ఖండించడానికి. అక్కడ వుత్తానక్రీస్తు దేవునికి ఎదురు తిరిగిన పిశాచాలమీద తన ఆధిపత్యాన్ని నెరపాడు. సిలువ మరణం వలన పిశాచాలు ఓడిపోయాయని తెలియజేయడమే అతని బోధ. కనుక ఈ యర్థం ప్రకారం పాతాళంలోవున్న "ఆత్మలు" పితరులుకాదు, పిశాచాలు. క్రీస్తు ఇక్కడ ప్రత్యేక రక్షణకార్యమేమీ నిర్వహించలేదు. పాతాళానికి దిగడం అతని మరణంలో ఓ భాగం మాత్రమే. నేడు మనం ఈ రెండవ అర్ధాన్ని గ్రహించాలి.

క్రీస్తు పాతాళానికి దిగడం అన్న సంఘటనంలో రెండంశాలు వున్నాయి, మొదటిది, అది అతని మరణాన్ని తెలియజేస్తుంది, యూదుల సంప్రదాయం ప్రకారం పాతాళం అంటే దైన్యస్థితి. కనుక క్రీస్తు పాతాళానికి వెళ్ళాడంటే దైన్యస్థితిని పొందాడని భావం. ఆ దైన్యస్థితి అతని సిలువ మరణంలో ఓ భాగం, యూదుల భావాలప్రకారం చనిపోయినవాళ్ళంతా పాతాళం చేరుకొంటారు. కనుక క్రీస్తుకూడ అక్కడికి వెళ్ళాడు. అక్కడ దైవదర్శనం లభించదు. పాతాళంలోని ఫబోరాతిఘరోరమైన అంశం ఇదే. ఇక క్రీస్తు ఈ దుఃఖపూరితమైన తావుకి వెళ్ళాడు అంటే మహా దుస్థితికి గురయ్యాడని భావం.