పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదాము సంతతియైన నరులు మట్టిమానుసులనీ దుర్భల ప్రాణులనీ అతనికి అర్థమౌతుంది. కనుక అతడు మన బలహీనతలను అర్థంచేసికొని మనయెడల సానుభూతి చూపగలవాడు పైగా ఆ ప్రభువు కృపాసింహాసనం లాంటివాడు. అనగా దేవుని కృపా కరుణా ఈ క్రీస్తే, కనుక అతడు శోధనలు వచ్చినపుడు మనకు సమయోచితమైన సహాయం చేయగలడు. మన తరపున మనం మాత్రం అతన్ని శరణువేడాలి. నమ్మికతో ధైర్యంతో అతని సహాయం అడుగుకోవాలి –4,14-16, ఈలా క్రీస్తుని ఆశ్రయించడం తప్ప శోధనలను జయించే మార్గం మరొకటి లేదు.

ప్రార్థనా భావాలు

1. శోధనల్లో మన స్వాతంత్ర్యం నశించదని చెప్పాం. మనం ఏ శోధనకూ లొంగిపోవలసిన అవసరం లేదు. మనం కోరుకొంటే చాలు ఏలాంటి ప్రలోభాన్నయినా జయించవచ్చు. “దేవుడు మీ శక్తికి మించి మిమ్మ శోధింపబడనీయడు. అంతేకాక, శోధన వచ్చినపుడు దాన్ని భరించగలిగే శక్తిని మీకు దయచేస్తాడు” - 1 కొ 10,13. ఈ వాక్యాలనుబట్టి మనం శోధనల్లో వున్నపుడు ప్రభువు సహాయం మనలను ఆదుకొనటానికి సిద్ధంగా వుంటుందని అర్థంచేసికోవాలి. ఈ సహాయంకోసం మనం వినయంతో మనవిచేసికోవాలికూడ.

2. ప్రభువు సైతాను శోధనలను జయించాడని చెప్పాం. అతడు పిశాచాన్ని కూలద్రోసిన నాయకుడు. ప్రభువు వచ్చిందాకా పిశాచం ఈ లోకనాయకుడు - యోహా 12,31. కాని అతని రాకడతో అది ఓడిపోయింది. కావననే క్రీస్తు పిశాచం మెరుపు తీగలాగ పడిపోతుంటే నేను చూచాను అని వాకొన్నాడు - లూకా 10,18. ఈలా ప్రభువుకి ఓడిపోయిన పిశాచాన్ని మనం ఏనాడు ఆశ్రయించగూడదు. ఏనాడు దాని సహాయాన్ని అడుగుకోకూడదు. ప్రభువుకి ఓడిపోయిన పిశాచం మనలను ఏలా ఆదుకొంటుంది? ఈ సంగతి తెలియక కొందరు కష్టాలు వచ్చినపుడు పిశాచాన్ని ఆశ్రయిస్తుంటారు. మంత్రతంత్రాలు, సోదె తాయతులు మొదలైనవాటికి పూనుకొంటుంటారు, వీటికి పూనుకోవడమంటే ప్రభువుని నమ్మకపోవడమే. మనలను రక్షించడానికిగాని శిక్షించడానికిగాని ప్రభువొక్కడే సమర్థుడని గ్రహించకపోవడమే. కనుక మనం ఈ ప్రలోభాలకు లొంగకూడదు.

3. మనలో ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత వుంటుంది. కొందరు కామాతురులు. మరికొందరు గర్వాత్మలు. వేరుకొందరు సోమరిపోతులు. ఇంకా కొందరు కలహప్రియులు. ఈ రీతిగా ఒక్కొక్కరిని ఒక్కోదురుణం పట్టి పీడిస్తుంది. ఇక,