పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

పదం పూర్వవేదంలోని బాధామయ సేవకుణ్ణి గుర్తుకి తెస్తుంది. పూర్వవేదంలో ఇతడు దేవుని సేవకుడు. దేవుడు ఇతన్ని ఎన్నుకొని బలాఢ్యుణ్ణి చేసాడు. ఇతడంటే దేవుడికి ఇష్టం - యెష42,1. ఈ సేవకుళ్ళాగే క్రీస్తకూడ ప్రజలకోసం ఆత్మార్పణం చేసికొంటాడు. మూడవది, మీరితని పల్కులు ఆలించండి అని తండ్రి శిష్యులతో చెప్పడం. పూర్వవేదంలో మోషే ఓ రానున్న ప్రవక్తనుగూర్చి చెప్పాడు. "ప్రభువు మీ ప్రజలనుండే నావంటి ప్రవక్తనొకనిని మీ చెంతకు పంపుతాడు. మీరు అతని మాటలు వినండి" అని ఆదేశించాడు - ద్వితీ 18,15. మోషే పేర్కొన్న ప్రవక్త ఈ క్రీస్తేనని తండ్రి ఉద్దేశం. శిష్యులు క్రీస్తు పల్కులు వినాలి. కాని క్రీస్తు పలుకులు ఏమిటివి? అతడు తండ్రినిగూర్చి బోధిస్తాడు. ఆ తండ్రి దయ ప్రేమ విశ్వసనీయత మొదలైన గుణాలను విశదీకరించి చెస్తాడు. కనుక క్రీస్తు తండ్రినిగూర్చి చెప్పే సంగతులను శిష్యులు భక్తిశ్రద్ధలతో ఆలించాలని భావం.

తండ్రి మేఘంలోనుండి పై సాక్ష్యమంతా పలికాడు. బైబుల్లో మేఘం దైవసాక్షాత్కారానికి చిహ్నం. కనుక ఇక్కడ క్రీస్తు శిష్యులూ మొదలైనవాళ్ళంతా దైవసన్నిధిలో వున్నారని భావం. క్రీస్తు ఓలివు కొండనుండి మోక్షారోహణం చేసేపుడు ఈ మేఘం మళ్ళా ప్రత్యక్షమౌతుంది - అ,చ 19.

6. శిష్యుల బుద్ధిమాంద్యం, ప్రభువు ముగురు శిష్యులనే కొండమీదికి తీసికొనివెళ్ళాడు. కాని ఈ ముగ్గురూ శిష్యులందరికీ ప్రతినిధులుగా వుంటారు. ప్రభువు మారురూపం తాల్చి మోషేయేలీయాలతో మాట్లాడుతూంటే శిష్యులు నిద్రమత్తులో వున్నారు - లూకా 9,82. ఇది వాళ్ళ భక్తినిగాక, అజ్ఞానాన్ని సూచిస్తుంది. పేత్రు క్రీస్తుకి సిలువ మరణం లేకుండానే మహిమ కలగాలని ఆశించాడు - మత్త 16,22. కనుక శిష్యులకు క్రీస్తు మరణోత్తానాల భావం ఇంకా అర్థంకాలేదు. ఈ కొండమీది దివ్యరూపధారణం భావం కూడ వాళ్ళింకా గ్రహించలేదు. పేత్రు కొండమీద మూడు పర్ణశాలలు నిర్మిస్తానన్నపుడుగూడ తాను మాట్లాడేదేమిటో తానే అర్థంచేసికోలేదు - లూకా 9,83. అతడు ఆ సమయంలో క్రీస్తు సిలువను విస్మరించి అతని మహిమను మాత్రం దక్కించుకోవాలని చూస్తున్నాడు అనుకోవాలి.

2. దివ్యరూపధారణం భావం

ప్రభువు కొండమీద దివ్యరూపం తాల్చడంలో ఉద్దేశమేమిటి?

1. క్రీస్తుతేజస్సు అతని ఉత్థానానికి చిహ్నంగా వుంటుంది. పర్వతంమీద ప్రభువు మూర్తి తేజస్సుతో వెలిగిపోయిందని చెప్పాం. ఈ తేజస్సు అతని ఉత్తానతేజస్సుని సూచిస్తుంది. ఓ క్షణకాలం మాత్రం ప్రభువులో ఈ తేజస్సు కన్పించింది. ఉత్తానం