పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/248

ఈ పుట ఆమోదించబడ్డది

రాజనకు దాసులనుగాజేసి బాబిలోనియాకు ప్రవాసులనుగా పంపాడు, అన్యజాతి ప్రజలు బుగ్గయియున్న యెరూషలేం ప్రక్కగా నడుస్తూ ఈ మహానగరానికి ఈ గతి యేలపట్టిందని ప్రశ్నిస్తారు. యిస్రాయేలీయులు తమ దేవుని నిబంధనాన్ని మీరి అన్యదైవాలను పూజించారు కనుక వారికీ దుర్గతి పట్టిందని తమకు తామే సమాధానం చెప్పకొంటారు - యిర్మీ22,9.

4. ఆశావహమైన బోధలు

మీద యిర్మీయా పేర్కొన్ననూత్న నిబంధనాన్ని గూర్చి విన్నాం. ఆకాశం, భూమి, జగత్తు వున్నంతకాలం దేవుని నిబంధనం వ్యర్థంకాదని అతడు స్పష్టంగా జెప్పాడు – 31,35-37. అతనితోపాటు చాలమంది ప్రవక్తలు భవిష్యత్తులోనికి పారజూచారు. అంతవరకు ప్రభువు యూదులతో చేస్తూ వచ్చిన ఒడంబడికలు విఫలంకావని చెప్పారు. అతడు మళ్లా నూత్ననిబంధనాన్ని చేస్తాడని ప్రవచించారు. యెహెజ్కేలు ప్రవక్త ఈ నిబంధననుగూర్చి మాట్లాడుతూ, ప్రభువు ప్రజలకు నూత్న హృదయాన్నీ నూత్నాత్మనీ దయచేస్తాడని చెప్పాడు. ఆ ప్రజలలోనుండి రాతిగుండెను తొలగించి వారికి మాంసపు గుండెను దయచేస్తాడని చెప్పాడు - 36, 26-28, పురుషుడు దోషియైన భార్యను విడనాడి జాలితో ఆమెను మళ్ళా చేపట్టినట్లే ప్రభువు యిస్రాయేలును మళ్ళా స్వీకరిస్తాడని చెప్పాడు యెషయా -545–10. ఈ క్రొత్త వొడంబడిక లేచిపోయిన భార్యను తీసికొనివచ్చి మళ్లా పెండ్లిజేసికోవడంలా వుంటుందని పల్మాడు హోషేయ -220. రాబోయే బాధామయా సేవకునిద్వారా ఈ నూత్ననిబంధనం జరుగుతుందని బోధించాడు యెషయా -42,6. ఇవన్నీ చాల గొప్ప ప్రవచనాలు. పలుసారులు భక్తితో మననం చేసికోదగ్గవి.

4. నూత్న నిబంధనకారుడు క్రీస్తు

పై ప్రవచనాలన్నీ నెరవేరి నూతనిబంధన-మధ్యవర్తియైన క్రీస్తు విజయం చేసాడు. ఆ ప్రభువు కడపటి విందును భుజిస్తూ పాత్రను అందుకొని "మీరందరు దీని లోనిది త్రాగండి. ఇది అనేకుల పాపపరిహారార్థమై చిందబడనున్న నూతన నిబంధనం యొక్క నా రక్తం" అన్నాడు -మత్త 26, 27-28. ఈ వాక్యం పూర్వం మోషే పీఠం మీదా ప్రజలమీనా నెత్తురు చిలకరిస్తూ "ప్రభువు మీతో చేసికొనిన నిబంధనకు సంబంధించిన రక్తం ఇదే" అన్న పలుకులను జ్ఞప్తికి తెస్తుంది - నిర్గ 248. ప్రభువు అక్కడ మోషే చిందించిన నెత్తురుద్వారా ప్రాత వొడంబడికను చేయిస్తే, ఇక్కడ క్రీస్తు చిందించే నెత్తురుద్వారా క్రొత్త వొప్పందాన్ని చేయిస్తాడు. అక్కడ జంతువుల నెత్తురుకు బదులుగా ఇక్కడ క్రీస్తు సొంత నెత్తురు పనిచేస్తుంది.

ఇంకా, యెషయా ప్రవక్త బాధామయ సేవకుని ద్వారా క్రొత్త నిబంధనం జరుగుతుందని చెప్పాడు గదా! ప్రభువు ఆ సేవకునితో