పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/236

ఈ పుట ఆమోదించబడ్డది

మక్కబీయుల గ్రంథంలో, వేదహింసలో ఏడ్డురు కుమారులను కోల్పోయిన తల్లి ఆ కుమారులనుద్దేశించి "మీరు మీ ప్రాణాలకంటెగూడ ఆ ప్రభువు ఆజ్ఞలను అధికంగా గౌరవించారు. కనుక ఆ కరుణామయుడైన దేవుడు మీకు మరలజీవాన్నీ ఊపిరినీ దయచేస్తాడు" అంటుంది - 7,23. ఆ కుమారుల్లో వొకడు తమ్ము హింసించి చంపే అంటియోకసు రాజునుద్దేశించి "నా సోదరులు ప్రభువు నిబంధనానికి బదులై క్షణకాలం మాత్రం బాధలనుభవించారు. కాని యిప్పడు వాళ్ళు నిత్యజీవితాన్ని చూరగొన్నారు" అంటాడు -7,36.

దానియేలు గ్రంథం కూడ “అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించేవారిలో చాలమంది సజీవులౌతారు. వాళ్ళల్లో కొందరు నిత్యజీవాన్ని పొందుతారు. మరికొందరు శాశ్వతావమానానికి గురౌతారు" అంటుంది-12,2. ఈ వాక్యం ఉత్మానాన్నీ మోక్షనరకాలనూ సూచిస్తుంది. సొలోమోను జ్ఞానగ్రంథం.
"పుణ్యపురుషులు శాశ్వతంగా మనుతారు
ప్రభువు వారిని బహూకరిస్తాడు
మహోన్నతుడు వారిని కాపాడతాడు"
అని చెప్పంది - 5,15. కనుక మృత్యువు నరజీవితానికి అంతంకాదు, మరణం తర్వాత నరులు భగవంతుని కరుణవల్ల నూత్నజీవాన్ని పొందుతారు.

4. నేనే జీవాన్ని

1. క్రీస్తు జీవాన్ని గూర్చి బోధించాడు

ఇంతవరకు జీవాన్ని గూర్చిన పూర్వవేద బోధలను చూచాం. ఇక నూత్నవేద బోధలను తిలకిద్దాం. క్రీస్తు జీవాన్ని విలువతో చూచాడు.కావుననే అతడు మీ యాహారం కంటె మీ జీవితం విలువైందని వాకొన్నాడు - మత్త 6,25. విశ్రాంతి దినాన్ని పాటించడంకంటె ప్రాణాన్ని రక్షించడం మేలని పల్మాడు - మార్కు 3,4 దేవుడు సజీవుల దేవుడు కాని మృతుల దేవుడు కాడని చెప్పాడు - మార్కు 12, 27. అతడు అనేక పర్యాయాలు వ్యాధినుండీ మృత్యువునుండీ ప్రజలను కాపాడాడు. అతడు చేరువలో వున్నట్లయితే తన సోదరుడు మరణించి వుండేవాడు కాదని మొత్తుకుంది మార్త - యోహా 11,21. అతడు తన్నననుసరించేవారికి నిత్యజీవాన్ని దయచేస్తాడు - మత్త 1929. కాని ఈ నిత్యజీవాన్ని పొందాలంటే నరుడు స్వార్థత్యాగం చేయాలి. “తన ప్రాణాన్ని కాపాడుకోగోరేవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. నా నిమిత్తమై తన ప్రాణాన్నిధారపోసేవాడు దాన్ని దక్కించుకొంటాడు" - మత్త 16,26.