పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/235

ఈ పుట ఆమోదించబడ్డది

"జ్ఞానం వివేకం బలం ఎచట దొరుకుతాయో తెలిసికోండి
అపుడు మీకు దీర్గాయువూ వెలుగూ శాంతీ లభిస్తాయి"
-3,14. ఈ జ్ఞానం ధర్మశాస్త్రమే, ఫలితాంశమేమిటంటే, ధర్మశాస్త్రంలోని కట్టడలను పాటిస్తేయూదులకు పూర్ణజీవం సిద్ధిస్తుంది.

2) జీవానికి ఆధారం దేవుడే

నరుడు భూమిమీద జీవిస్తాడు, ఐనా అతని జీవం ఈ లోక వస్తువులమీదకాక దేవునిమీద ఆధారపడివుంది, దేవుడు అతనికి జీవజలాలబుగ్గ - యిర్మి2,13. జీవప చెలమ - కీర్త 36,9. ప్రభువు ప్రేమ ప్రాణంకంటె మెరుగైంది - కీర్త 63,3. కనుకనే భక్తిగల యిస్రాయేలీయుడు దేవుని సన్నిధిలో, ప్రభువ మందిరంలో జీవింపగోరుతాడు. అందుకే భక్తుడు
“అన్యుల యిండ్లలో వేయిదినాలు గడిపిందానికంటె
నీ మందిరంలో ఒక్కరోజు వసించడం మేలు"
అన్నాడు - 84, 10 మరో భక్తుడు

"నేను కలకాలం ప్రభు మందిరంలోనే వసిస్తాను" అని వాకొన్నాడు – 23,6. ప్రవక్త ఆమోసు కూడ

"ప్రభువు యిస్రాయేలీయులతో ఈలా చెప్తున్నాడు మీరు నా చెంతకురండి, జీవాన్ని బడయండి"

అని నుడివాడు - 5, 14. ఈ వాక్యాలన్నిటినిబట్టి నరుని జీవం భగవంతుడేనని అర్థమౌతుంది కదా!

3. మృత్యువు తర్వాత మళ్ళీ జీవం

దేవుడెప్పడుకూడ పాపి చావాలని కోరుకోడు. అతడు పరివర్తనం చెంది మళ్ళా బ్రతకాలనే కోరుతాడు - యెహె 33,11. ప్రభువు తన ఆత్మద్వారా ఎండిపోయిన ఎముకలకు గూడ జీవమిస్తాడు - యెహె 37,13-14 బాధామయ సేవకుడు ప్రజలకోసం చనిపోయాడు. కాని అతడు తన అనుయాయుల్లో మళ్ళా జీవిస్తాడు. కనుకనే యెషయా ప్రవక్త
“అతని మరణం పాపపరిహారబలి ఐంది
కనుక అతడు దీర్గాయువును బడసి
పత్ర పౌత్రులను జూస్తాడు"
అని చెప్పాడు – 53, 10 అనగా భక్తులు దేవుని కరుణచే మరణం తర్వాత మళ్ళా జీవిస్తారు. పూర్వవేదాంతంలో ఈ భావం మూడునాలు తావుల్లో తగుల్లుంది. రెండవ