పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/226

ఈ పుట ఆమోదించబడ్డది

గోరితే వాళ్ళ దుండగులై హత్యకు పూనుకొన్నారు. ఆ దుషుల అన్యాయానికి గురైన పేదల యేడ్పులు వీధుల్లో విన్పించాయి, కనుక ప్రభువు ఆ ద్రాక్షతోటను సర్వనాశం చేస్తాడు. ఇది ప్రవక్త భావం.

యిస్రాయేలీయుల దుష్టత్వాన్నివర్ణిస్తూ యిర్మియాకూడ వారిని పాడు ద్రాక్షతోటతో పోల్చాడు :

"మంచి విత్తనాన్నుండి మొలకెత్తిన
శ్రేష్టమైన ద్రాక్షతీగనుగా నేను మిమ్ము నాటాను
కాని మీరిపుడు నిప్రయోజకమైన
భ్రష్టజాతి ద్రాక్షలుగా మారిపోయారు" - 2,21.
యెహెజేలు ప్రవచనం ప్రకారం యిప్రాయేలనే పాడు ద్రాక్షతోటను పెరికివేస్తారు, కాల్చివేస్తారు - 19,10–14.

2. అంత్య కాలంలో

ప్రవక్తలు మెస్సీయా కాలంలో యిప్రాయేలీయుల బదులు మారతాయని చెప్పారు. వాళ్ల మంచి ద్రాక్షతోటలా చక్కని పండ్ల ఫలిస్తారని నుడివాడరు. యెషయా ఈలా వాకొన్నాడు.

"ఆ దినాన ప్రభువు ఆనందప్రదమైన
తన ద్రాక్షతోటనుగూర్చి యిూలా, పాడతాడు
ప్రభువునైన నేను ఆ తోటను సంరక్షిస్తాను
నిరంతరం దానికి నీరు కడతాను
రేయింబవళ్ళు దాన్ని కాపాడుతూ
ఎవరూ దానికి కీడు చేయకుండా వుండేలా చూస్తాను
ఆ తోటమీద నాకిపుడు ఏలాంటి కోపమూ లేదు"
-27,2-4 అనగా ప్రభువు యిప్రాయేలు తప్పలను మన్నించి దాన్ని సంరక్షిస్తాడని భావం.

80వ కీర్తనను వ్రాసిన భక్తుడు యిప్రాయేలును ఐగుప్తనుండి తీసికొనివచ్చి పాలస్తీనా దేశంలో నాటిన ద్రాక్షతీగనుగా వర్ణించాడు. దాన్ని శత్రువులబారినుండి రక్షించమని ప్రభువుకి మనవి చేసాడు.

"ఐగుప్తనుండి నీ వొక ద్రాక్షతీగను తీసుకవచ్చావు
అన్యజాతులను వెళ్ళగొట్టి వాళ్ళ దేశంలో దాన్ని నాటావు
ఆ తీగ పెరగడానికి నేలను సరిచేసావు