పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/217

ఈ పుట ఆమోదించబడ్డది

ఐగుప్తు ప్రవాసం నుండి, రెండవ నిర్గమనం బాబిలోనియా ప్రవాసం నుండి, ఈ రెండవ నిర్గమనంలో వాళ్లు క్షాంతవధువు లాంటివాళ్లు, ఇక యీ మూడంశాలను క్రమంగా పరీశీలిద్దాం.

1. అనురాగంగల వధువు

ప్రభువు ఎడారిలో సీనాయి కొండ దగ్గర యిస్రాయే లీయులతో ఒడంబడిక చేసికొన్నాడు, దీనిద్వారా వాళ్ళకూ అతనికీ సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం ద్వారా ఆ ప్రభువు వరుని లాంటివాడూ, ఆ ప్రజలు వధువు లాంటివాళూ అయ్యారని చెప్పాం. ఈ యెడారి కాలం యిస్రాయేలీయుల చరిత్రలో పరమ పవిత్రమైంది, ఆకాలంలో వాళ్లు ప్రభువుపట్ల గాఢమైన భక్తితో జీవించారు.

ఈ కాలాన్ని మనసులో పెట్టుకొనే 800 యేండ్ల తర్వాత యిర్మీయా ప్రవక్త "ప్రభువు వాక్కిది

నీవు యువతివిగా వున్నప్పడు

నాపట్ల చూపిన అనురాగాన్నీ

నా వధువు వైనపుడు నాపట్ల చూపిన ప్రేమనీ,

నేను జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాను

నీవు పైరు వేయని తావగు ఎడారిగుండ

నన్ననుసరించి వచ్చావు"

అని నుడివాడు - 2,2. ఇక్కడ యిర్మీయా ప్రవక్త యిస్రాయేలును లేబ్రాయపు యువతినిగా భావించాడు. ఎందుకంటే అప్పడే వాళ్ళు ఎడారిలో నిబంధనం ద్వారా యావే ప్రజలయ్యారు. ఈలా ఐ కొన్ని నెలలు మాత్రమే ఐంది. ఆ తొలి రోజుల్లో యిస్రాయేలు కన్యకు తన వరుడైన యావేపట్ల గాఢమైన ప్రేమానురాగాలు వుండేవి. ఆమె హృదయంలో అన్యప్రేమలు లేవు. ప్రభువును అనుసరిస్తూ ఎడారిగుండ నలబై యేండ్లు ప్రయాణం చేసింది.

45వ కీర్తన మొదట ఒకానొక యిప్రాయేలు రాజు వివాహాన్ని వర్ణించడానికి వ్రాయబడింది. కీర్తనకారుడు ఈ పాటలో రాజనీ రాణినీ వర్ణించాడు. కాని ఇది క్రమేణ మెస్సీయాకు వర్తించే కీర్తనగా మారిపోయింది, మెస్సీయా భర్త, ప్రజలు అతని వధువు అనే భావం ఈ కీర్తనలోకి ప్రవేశించింది. కీర్తనకారుడు ఈ పాటలో రాణి నుద్దేశించి

'కుమారీ! నీవు నా పలుకులు సావధానంగా విను

మీ ప్రజలను మీ పుట్టింటిని ఇక మరచిపో

ఈ రాజు నీ సౌందర్యానికి మురిసిపోతాడు

ఇతడు నీ కధిపతి కనుక నీ వితనికి నమస్కరించు"