పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/153

ఈ పుట ఆమోదించబడ్డది

సమయంలో సిలువ మిూద నుండి రసం త్రాగడు, నాల్గవ సువిశేషం మాత్రం త్రాగాడని చెప్తుంది. ఈలా త్రాగడం వల్ల కీర్తన 69,21 పేర్కొనే ప్రవచనం నెరవేరింది, అది యిది.

వాళ్లు నాకు భోజనానికి మారుగా విషాన్నిచ్చారు,
నేను దప్పికగొని వున్నపుడు
త్రాగడానికి సిరకా నిచ్చారు.

ఇక్కడ సువిశేషకారుడు క్రీస్తు దప్పికగొన్నాడని చెప్పాడు. ప్రభువుకి భౌతికంగా దప్పిక వేసింది. నిజమే, కాని అతని దప్పిక కేవలం భౌతికమైంది మాత్రమే కాదు. ఆధ్యాత్మికమైంది కూడ. ప్రభువు దప్పికగొంది ప్రధానంగా తండ్రి నిర్ణయించినట్లుగా సిలువ విూద చనిపోవడానికే. అంతకుముందే అతడు పేత్రుతో "తండ్రి నాకిచ్చిన శ్రమల పాత్రను నేను పానం చేయవద్దా" అన్నాడు-18, 11. ఈ పాత్ర సిలువ మరణమే. కనుక క్రీస్తు దప్పిక ప్రధానంగా సిలువ మరణానికే తన్ను ప్రేమించినవాళ్ళ కొరకు ప్రాణాలను ధారపోయడానికే. తండ్రి దగ్గరికి తిరిగిపోవడానికే. అతడు ప్రధానంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు.

ఈ ఘట్టంలో హిస్సోప మండప్రస్తావనం వస్తుంది! పూర్వం యూదులు ఈజిప్టు నుండి బయలు దేరి రాకముందు హిస్సోపు మండతో పాస్క గొర్రెపిల్ల నెత్తుటిని తమ గోడలకు పూసికొన్నారు. దీనివల్ల వాళ్ళకు చావు తప్పింది - నిర్గ12.22. ఇక్కడ హిస్పోపను అందుకొన్న క్రీస్తుగొర్రెపిల్ల నెత్తురు మనలను పాపం నుండి రక్షిస్తుంది.

ప్రభువు సిలువమిూద పల్కిన తుదిపల్కు "సమాప్తమైనది" అనేది. ఆ మాట పల్కి అతడు ఊపిరి విడిచాడు. కాని ఇక్కడ ఏమి సమాప్తమైంది? క్రీస్తు తండ్రి తన కొప్పజెప్పిన రక్షణ ప్రణాళికను ముగించాడు, పరలోక రాజ్యాన్ని గూర్చి బోధించాడు. అద్భుతాలు చేసాడు. మెస్సియాను గూర్చిన పూర్వవేద ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేరాయి. ప్రభువు గడియ, అనగా అతని మరణకాలం ఆసన్నమైంది. దానికోసమే అతడు ఉత్కంఠంతో నిరంతరం ఎదురు చూస్తున్నాడు. అతని సిలువ మరణం ద్వారా మనకు పాపపరిహారం జరుగుతుంది. ఈ విధంగా క్రీస్తు అన్నీ సమాప్తం చేసాడు. కనుకనే అతడు చిట్టచివరన ఈ మాటను పల్మాడు. ఇక్కడ "సమాప్తమైనది" అనే పల్కును క్రీస్తు చిట్టచివరి క్షణాల్లో చేసిన విజయనాదంగా భావించాలి. తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి అతడు విజయాన్ని సాధించాడు. మత్తయి మార్కు సువిశేషాల్లో ప్రభువు "నా దేవా నా దేవా! నన్నేల చేయివిడిచావు?” అంటూ చనిపోయాడు -27,46, లూకా సువిశేషంలో "తండ్రీ! నా యాత్మను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను" అంటూ మరణించాడు - 28,46, కాని యోహాను సువిశేషంలో అతడు “సమాప్తమైనది" అంటూ ప్రాణాలు విడిచాడు. నాలు