పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/150

ఈ పుట ఆమోదించబడ్డది

చేసారు. తాను యూదుల రాజునని చెప్పకొన్నాడు అని వ్రాయించమన్నారు. కాని పిలాతు వారి మాటలు వినలేదు. నేను వ్రాయించినదేదో వ్రాయించాను. ఇప్పడు విూ మాటలు విని దాన్ని మార్పించను అన్నాడు, ఈ నాయకులు పూర్వం పిలాతుని నిర్బంధించి క్రీస్తుకి మరణశిక్ష విధింపజేసారు. కాని అతడు ఇప్పడు మల్లా వారి నిర్బంధానికి లొంగదలచుకోలేదు. ఇక్కడ విశేషమేమిటంటే అన్యజాతి వాడైన పిలాతు క్రీస్తుని రాజుగా అంగీకరిస్తున్నా స్వీయజాతివాళ్లు అలా అంగీకరించలేదు. వాళ్లు ద్రోహబుద్ధితో రోమను ప్రభువైన కైసరుని రాజునిగా ఎన్నుకొని క్రీస్తుని నిరాకరించారు. ఐనా ప్రభువు యూదులకూ విశ్వప్రపంచానికి గూడ రాజు, పిలాతు క్రీస్తు రాజని మూడుభాషల్లో వ్రాయించాడు. ఆనాడు ఆ మూడు భాషలు రోమను సామ్రాజ్యం లోని ప్రజలు వాడేవి. అనగా విశ్వప్రపంచం అతని రాజత్వాన్ని అంగీకరినుందని భావం, యూదులు అంగీకరించకపోయినా నేడు మనం ప్రభువునికి రాజాధిరాజునుగా అంగీకరించాలి. అతనికి మొక్కాలి. అతని నుండి రక్షణం పొందాలి. పిలాతు తాను చేసేదేమిటో గ్రహించకుండానే క్రీస్తు యూదుల రాజని వ్రాయించాడు. కాని మనం ప్రభువు రాజని గ్రహించి భక్తిభావంతో అతన్ని ఆరాధించాలి,

2. కుట్టలేని అంగీ - 1923-24

సైనికులు క్రీస్తు వెలుపలి దుస్తులను పంచుకొన్నారు. అవినాలు - తలగుడ్డ, నడికట్టు, లోపలివస్త్రం, చెప్పలు. వీటిని నల్లురు తలా వొకటి చొప్పన తీసికొన్నారు. ఇక వెలుపలివస్త్రం మిగిలివుంది. అది కుట్టలేనిది. ఏకవస్త్రంగా నేయబడింది. నాలుముక్కలుగా చింపితే ఎందుకూ పనికిరాకుండా పోతుంది. కనుక దీనికోసం వాళ్లు చీట్ల వేసికొన్నారు. ఈ క్రియ ద్వారా పూర్వవేద ప్రవచనం నెరవేరింది. ఆ ప్రవచనం కీర్తన 22,18లో వస్తుంది.

"వాళ్లు నా బట్టలను తమలో తాము పంచుకొంటున్నారు
నా దుస్తుల కొరకు చీట్ల వేసికొంటున్నారు.

క్రీస్తు మరణమూ ఆ మరణ కాలంలోని సంఘటనలూ యాదృచ్ఛికంగా జరిగినవి కావు. తండ్రే వాటిని నిర్ణయించాడు. పూర్వవేద ప్రవక్తలు వాటిని గూర్చి ముందుగానే తెలియజేసారు. క్రీస్తుకి అంతా ముందే తెలుసు. అతడు బుద్ధిపూర్వకంగానే తన మరణాన్ని అంగీకరించాడు.

ఇక్కడ ఈ కుట్టలేని ఏకవస్త్రం లోతైన భావాలను కూడ సూచిస్తుంది. క్రీస్తులాగే యూదుల ప్రధాన యాజకులు కూడ కుట్టలేని ఏకవస్తాన్ని ధరించేవాళ్లు, కనుక ఇక్కడ