పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/139

ఈ పుట ఆమోదించబడ్డది

248, ఏలీయా హోరెబుకొండనెక్కగా ప్రభువు అతనికి దర్శనమిచ్చాడు. అప్పుడు పెనుగాలి వీచి కొండబండలను బ్రద్దలు చేసింది -1రాజు 19, 11. ఈ యాలోకనాలన్నిటి భావమేమిటంటే, దైవ సాన్నిధ్యాన్ని చూచి ప్రకృతి గడగడ వణకి కంపించిపోయింది.

4. సమాధులు తెరచుకోవడం, యూదులు కొండల్లోనే సమాధులను తొలిపించి మృతులను పాతిపెట్టేవాళ్లు, క్రీస్తుని గూడ అలాంటి సమాధిలోనే పాతిపెట్టారు. ఇక్కడ కొండబండలు పగలగానే సహజంగానే వాటిలోని సమాధులు కూడ తెరచుకొన్నాయి. క్రీస్తు మరణంతో సమాధుల్లో వున్న పూర్వవేద భక్తులకు విమోచనం కలిగింది. కావున వాళ్లు సమాధులు తెరచుకొని బయటికి వచ్చేసారు.

పూర్వవేద ప్రవచనాలు కూడ అంత్యకాలంలో మృతులు ఉత్థానమౌతారని చెప్తాయి. దానియేలు ప్రవచనం 12,2 ఈలా వాకొంటుంది. "అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించే వారిలో చాలమంది సజీవులౌతారు. వారిలో కొందరు నిత్యజీవాన్ని పొందుతారు". ఇంకా, యెహెజ్కేలు గ్రంథం 37.12 ఈలా వాకొంటుంది. "నా ప్రజలారా! నేను విూ సమాధులను తెరచి మిమ్మ లేపుతాను. మిమ్మ మల్లా యిస్రాయేలు దేశానికి తోడ్కొనివస్తాను". ఇక్కడ మన సందర్భంలో ఉత్తాన క్రీస్తు మృతులకు జీవాన్ని ప్రసాదించాడని భావం. ఆ ప్రభువు తాను జీవవంతుడై మృతులను గూడ జీవమయులను చేసాడని అర్థం.

5. ఉత్తానమైన మృతులు పవిత్ర నగరం ప్రవేశించి అనేకులకు కన్పించడం, జ్యేష్ఠకుమారుడైన క్రీస్తు ఉత్తానం అతని సోదరులకు గూడ సోకుతుంది - రోమా 8,29. చనిపోయిన వారిలో నుండి క్రీస్తు ప్రథమ ఫలమో అన్నట్లుగా ఉత్తానమయ్యాడు. అతని ఉత్తాన మహిమ ఇతరులకూ సోకుతుంది - 1కొ 15,10. కనుక ప్రభువు ఉత్తానమైన పిమ్మట అతని ప్రభావం సోకి అప్పటిదాకా సమాధుల్లో వేచివున్న భక్తులు జీవంతో లేచారు. యెరూషలేములో చాలమందికి కన్పించారు. ఇక్కడ క్రీస్తు మరణమే అతని వుత్థానం అనుకోవాలి.

పైన మనం పేర్కొన్న ఐదు సంఘటనలూ చారిత్రకమైనవి కావు. ఇక్కడ క్రీస్తు మరణం ద్వారా ఎల్లరకి రక్షణం కలిగిందని తెలియజేయడమే మత్తయి ఉద్దేశం. ఈ సంఘటనాలు చారిత్రకమైనవి కాకపోయినా ఇవి బోధించే దైవశాస్తాంశాలు మాత్రం చాల విలువైనవి.

శతాధిపతీ సైనికులూ క్రీస్తు చుటూ కాపలా కాస్తున్నారు కదా! వాళ్లు భూకంపం మొదలైన పై అసాధారణ సంఘటనాలను జూచి భయపడ్డారు. అవి క్రీస్తు నీతిమంతుడని తెలియజేయడానికి దేవుడు కలిగించిన కార్యాలే. కనుక వాళ్ళ చనిపోయిన క్రీస్తులో ఏదో దైవశక్తి యిమిడివుందని గుర్తించారు. ఈ క్రీస్తు నిజంగా దైవకుమారుడేనని