పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/131

ఈ పుట ఆమోదించబడ్డది

సిలువ విూద వ్రేలాడే క్రీస్తు శిరస్సు విూద అతని నేరమేమిటో వ్రాసిపెట్టారు. “ఇతడు యూదుల రాజైన యేసు” అని లిఖించి వుంచారు - 27,37. క్రీస్తు శత్రువులు ఊహింపని రీతిలో ఈ పదాలు గూధార్థాలను తెలియజేసాయి. ప్రభువు పేరు "యేసు". హీబ్రూభాషలో యెహోషువ. ప్రజలను వారి పాపాలనుండి రక్షించేవాడని ఆ పేరుకు అర్థం 1,21. అతని మరణం ద్వారానే మనకు రక్షణం కలిగేది. అతడు “రాజు" అనగా మెస్సీయా దైవప్రజలను పాపదాస్యం నుండి విడిపించే మెస్సీయా అతడే కాని ఈ మాటల్లోని ఈ లోతైన భావాలను ఆనాటి యూద నాయకులు గుర్తించనే లేదు.

ప్రభువుకి ఈ ప్రక్కా ఆ ప్రక్కా ఇద్దరు దొంగలను సిలువ వేసారు. ఆ యిద్దరు క్రీస్తుకి పరివారం లాగ వున్నారు. అనగా క్రీస్తు తన పరివారం లాగే తాను కూడ దుషుడు అని యూదుల భావం. వాళ్లు అతన్ని పూర్వమే సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని నిందించారు - 14,19.

సిలువ మిూద వ్రేలాడే క్రీస్తుని మూడు వర్గాలవాళ్లు హేళనం చేసారు. వాళ్లు దారివెంట బోయేవాళ్లు, యూదుల మహాసభ సభ్యులు, ఇద్దరు దొంగలు.

దారివెంట బోయేవాళ్లు వహ్వా అని తలవూపుతూ ప్రభుని గేలిచేసారు. కీర్తన 22,7లో శత్రువులు బాధలనుభవించే నీతిమంతుని వైపు జూచి వెటకారంగా తలవూపారు. ఆ సంఘటనం ఇక్కడ క్రీస్తు పట్ల నెరవేరింది. పూర్వం శత్రువులు ప్రభువు మిూద రెండు నేరాలు తెచ్చారు. అతడు దేవాలయాన్ని పడగొట్టి మూడురోజుల్లో మళ్లా నిర్మిస్తానన్నాడు - 26,61. తాను దైవసుతుద్ధాని చెప్పకొన్నారు - 26,23. ఈ నేరాలనే దారివెంట బోయేవాళ్లు కూడ మల్లా క్రీస్తు విూద మోపారు-27,40.

దేవాలయాన్ని కూలద్రోసి శక్తి మెస్సియాకుందని యూదులు నమ్మారు. వాళ్లు క్రీస్తు తనకా శక్తి వుందని చెప్పకొన్నాడని అతని మిూద నిందారోపణం చేసారు. అంతటి శక్తి కలవాడు తన్ను తాను రక్షించుకోలేక పోయాడు పాపం అని పరిహాసం చేసారు. కాని క్రీస్తు చనిపోయాక కొద్దియేండ్లలోనే రోమియలు వచ్చి ఈ దేవళాన్ని ధ్వంసం చేస్తారు. ఆ సంగతిని ఇప్పడు క్రీస్తుని ఎగతాళి చేసేవాళ్ళకు తెలియదు. ఇంకా శత్రువులు “నిన్ను నీవు రక్షించుకోచూద్దాం" అని దెప్పిపొడిచారు. కాని క్రీస్తు సిలువ మిది నుండి దిగివచ్చి తన్నుతాను రక్షించుకోడు. తన ప్రాణాలనర్పించే తన్ను తాను రక్షించుకొంటాడు. "తన ప్రాణాన్ని ధారపోసేవాడు దాన్ని దక్కించుకొంటాడు" అని అతడే బోధించాడు - యోహా10,15. సిలువ విూద ఆత్మార్పణం చేసికోవడం ద్వారా ప్రభువు తన్నూ మనలనూ గూడ రక్షిస్తాడు.