పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/130

ఈ పుట ఆమోదించబడ్డది

అనే కీర్తన వాక్యం 22, 18 నెరవేరింది. ఇది చాలగొప్ప కీర్తన. దీనిలో ఎవరో పూర్వవేద భక్తుడు తన సొంత శ్రమలను చెప్పకొన్నాడు. ఈ శ్రమలన్నీ క్రీస్తునందు సార్థకమయ్యాయి. క్రీస్తు సిలువపై ఈ కీర్తనను జపించి వుండవచ్చు కూడ. సువిశేషకారులు ఈ కీర్తనలోని చాల వాక్యాలను క్రీస్తుకి అన్వయించి చూపించారు. అసలు సువిశేషాలను వ్రాయకముందే, ఆదిమ క్రైస్తవ సమాజమే ఈ కార్యాన్ని ప్రారంభించింది. ఈ కీర్తనలో చరణాలను కొన్నిటిని పరిశీలిస్తే యిది ఎంత భక్తిగల కీర్తనో తెలుస్తుంది.

"ప్రభూ! నేను పగలెల్ల మొరపెట్టినను నీవాలింపవు
రేయెల్ల నీకు మనవి చేసినను ఉపశాంతి లేదు
మా పితరులు నిన్ను నమ్మిరి
నిన్ను నమ్మగా నీవు వారిని రక్షించింతివి
తల్లి కడుపునుండి నన్ను సురక్షితముగా
బయటికి కొనివచ్చినది నీవే
నేను మాతృస్తన్యమును గ్రోలి
భద్రముగా మననట్లు చేసినది నీవే
మాతృగర్భము నుండి వెలువడినప్పటి నుండియు
నేను నీ మిూదనే ఆధారపడితిని
నేను జన్మించినప్పటినుండియు నీవే నాకు దేవుడవు
నేనాపదలో ఉన్నాను
నీవు నాకు దవ్వగా ఉండవలదు
నీవు తప్ప నన్నాదుకొనువాడు ఎవ్వడును లేడు
ప్రభూ! నీవు నాకు దవ్వగా ఉండవలదు
నాకు బలమైన నీవు
నన్నాదుకొనుటకు శీఘమే రమ్మ.

క్రీస్తుని సిలువ వేసి అతని వస్తాదులను పంచుకొన్న పిదప సైనికులు అతనిచెంత కూర్చుండి కావలి కాయడం మొదలెట్టారు - 27,36. ఈ కావలి కాయడం అతని అంతాన్ని అనగా మరణాన్ని చూడ్డం కొరకు, మరణానంతరం ద్రోహి దేహాన్ని సిలువ మిూదినుండి దించుతారు. సైనికుల పని ముగుస్తుంది. ఈ సైనికులకు ఇక్కడ ఓ ప్రాముఖ్యముంది. తర్వాత క్రీస్తు మరణ సమయంలో సంభవించే భూకంపం మొదలైన అద్భుత సంఘటనలను జూచి వీళ్లు "ఇతడు నిక్కంగా దేవుని కుమారుడే" అని సాక్ష్యం పలుకుతారు - 27,54.