పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలనీ ఇతడు కుతూహలపడుతుండేవాడు. ఆ కుతూహలంతోనే అతడు క్రీస్తుకి చాల ప్రశ్నలు వేసాడు. కాని ప్రభువుకి అతని దుష్ట స్వభావం తెలుసు. కనుక అతడు హేరోదు ప్రశ్నలకు ఏమాత్రం జవాబు చెప్పకుండా బాధామయ సేవకుళ్లాగ మౌనంగా వుండిపోయాడు - యెష 53,7. క్రీస్తు మౌనాన్ని చూచి హేరోదు నిరుత్సాహం చెందాడు. అతడూ అతని సైనికులూ క్రీస్తుని చిన్నచూపు చూచి అవమానించారు. ప్రభువుకి విలువైన వస్తాన్ని కప్పి అతన్ని మళ్లా పిలాతు దగ్గరికి పంపారు.

క్రీస్తు తాను రాజునని చెప్పినందున అతన్ని పరిహసించడానికి హేరోదు ఈ రాజవస్త్రాన్ని కప్పి వుండవచ్చు, ఇది తెల్లని యుడుపు. కనుక ఇది క్రీస్తు నిర్దోషత్వానికి గూడ చిహ్నంగా వుంటుంది.

అంతవరకు శత్రువులుగా వున్న హేరోదు పిలాతు ఆనాడే ఈ సంఘటనం ద్వారా మల్లా మిత్రులయ్యారు. కీర్తన 2.2 చెప్పినట్లుగా "ప్రభువునీ, అతడు అభిషేకించిన రాజనీ ఎదిరించడానికి ఈ లోకపు రాజులు సంసిద్దులయ్యారు". యెరూషలేములోని ఆదిమ క్రైస్తవులు దేవునికి ప్రార్ధించినట్లుగా "నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకి విరోధంగా పోన్యస్ పిలాతు, హేరోదు ఈ నగరంలో ఏకమయ్యారు - అచ. 4,27. ఐనా హేరోదు పిలాతు కలసి కూడ క్రీస్తుని దోషిగా నిరూపించలేదు. అతడు నిర్దోషి అనే వాళ్లిద్దరి అభిప్రాయం.

2. యేసు – బరబ్బా – 27,15-26

పాస్క పండుగ సందర్భంలో గవర్నరు యూదులు కోరిన బందీని విడుదల చేసే ఆచారం వుంది. ఈ పండుగ యూదుల దాస్య విముక్తిని జ్ఞప్తికి తెచ్చేది. కనుక ఆ దినం ఓ బందీని వదలిపెడితే యూదులకు సంతోషం కలుగుతుందనుకొని రోమియులు ఈ యాచారాన్ని అంగీకరించారు.

ఈ సమయంలో బరబ్బ అనే పేరు మోసిన నేరగాడు చెరలో వున్నాడు. అతడు రోమికాయుల విూద తిరుగుబాటు చేసే యూదులకు నాయకుడు. పిలాతు క్రీస్తుకీ ఇతనికీ లంకెవేసి పాస్కపండుగ సందర్భంలో ఈ ఇద్దరిలో ఎవరిని విడిపించమంటారో తెలియజేయండని ప్రజల గుంపును అడిగాడు. ప్రధానార్చకులు క్రీస్తు ప్రసిద్ధికి అసూయపడి అతన్ని తనకు అప్పగించారని పిలాతుకు తెలుసు. జనుల గుంపుకి క్రీస్తు అంటే ఇష్టం గనుక వాళ్లు అతన్ని విడుదల చేయమని అడుగుతారనీ, ఆ నెపంతో తాను క్రీస్తుని వదలివేయవచ్చుననీ పిలాతు ఉద్దేశం, కాని అతడు అనుకొన్నట్లుగా జరగలేదు. కథ అడ్డం తిరిగింది.