పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/119

ఈ పుట ఆమోదించబడ్డది

పూనుకొన్నాడు. "మిమ్మ న్యాయస్థానాలకు ఈడ్చుకొని పోతారు. రాజుల చెంతకు రాష్ట్ర పాలకుల చెంతకు తోడ్కొని పోతారు. మిూరు అక్కడ నాకు సాక్ష్య విూయాలి” అని ప్రభువు పూర్వమే శిష్యులతో చెప్పాడు - 10,17-18, క్రీస్తే మొదట ఈ హింసలకు గురయ్యాడు. తర్వాత శిష్యులు కూడ ఈ బాధలు అనుభవిస్తారు.

పిలాతు క్రీస్తుని నీవు యూదుల రాజువా అని ప్రశ్నించాడు. యేసుని అందరు మెస్సీయాగా భావిస్తున్నారు. మెస్సీయా యావే ప్రతినిధిగా, రాజుగా వచ్చి తమ్ముపాలిస్తాడని యూదుల నమ్మకం. క్రీస్తుని గూర్చిన ముఖ్యాంశం అతడు రాజు అనేదే. కనుకనే మొట్టమొదటనే పిలాతు ఈ ప్రశ్న వేసాడు. క్రీస్తు నేరుగా జవాబు చెప్పలేదు. నీవన్నట్లే అని సమాధానం చెప్పాడు. ఇది ఓ రకమైన అరమాయిక్ ప్రయోగం. ఈ రకం ప్రయోగం వచ్చినపుడు ప్రశ్నవేసే వ్యక్తి ప్రశ్నలోనే జవాబు కూడ ఇమిడి వుంటుంది. పిలాతు యేసుని నీవెవరివి అని అడుగలేదు. నీవు యూదుల రాజువా అని అడిగాడు. ఆ ప్రశ్నలోనే అతడు యూదుల రాజేననే సమాధానం ఇమిడి వుంది. కావున నీవు చెప్పినట్లుగా నేను రాజనేనని క్రీస్తు బదులు పల్కాడు. అతడు దావీదు వంశంలో వచ్చే రాజు, ఆ రాజు కొరకే యిస్రాయేలీయులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఐనా అతడు లౌకికరంగంలో గాక ఆధ్యాత్మికరంగంలో రాజు.

ప్రధానార్చకులు యేసుపై ఏవేవో నేరాలు తెచ్చారు. కాని అతడు వారికి ప్రత్యుత్తర విూయకుండా మౌనంగా వుండిపోయాడు. వారు నీపై మోపే నేరాలకు నీవు ప్రత్యుత్తర విూయవా అని పిలాతు అడిగినా యేసు ఏమిూ మట్లాడకుండా మౌనంగా నిల్చుండి పోయాడు. పూర్వం బాధామయ సేవకుడు ఈలాగే మౌనంగా వుండిపోయాడని యెషయా వాకొన్నాడు – 58,7. ఆ ప్రవచనం ఇక్కడ క్రీస్తులో నెరవేరింది. క్రీస్తు మౌనాన్ని చూచి పిలాతు విస్తుపోయాడు. రీవితో తన యెదుట నిల్చివున్న క్రీస్తుని చూడగానే పిలాతుకి అతడు దోషికాడని తట్టింది. అతన్ని విడుదల చేయడం సబబని తోచింది. అలా చేయడానికి మార్గం బరబ్బా.

కాని బరబ్బా ఉదంతానికి ముందు మనం ఇంకో అంశం చూడాలి. ఈ యంశం లూకా 23,6-12లో మాత్రమే వస్తుంది, క్రీస్తు గలిలయ ప్రాంతానికి చెందినవాడని విని పిలాతు అతన్ని హేరోదు దగ్గరికి పంపాడు. ఈ హేరోదు పెద్ద హేరోదు కొడుకు. గలిలయకు అధిపతి, స్నాపక యోహానును చంపించినవాడు. ఇతడు ఈ సమయంలో పాస్మపండుగ జరుపుకోవడానికి వచ్చి యెరూషలేములో మకాము చేస్తున్నాడు. స్నాపక యోహానే మల్లా క్రీస్తురూపంలో విజయం చేసాడని జనం చెప్పకొంటుండగా హేరోదు విన్నాడు. ఆ ప్రభువు అద్భుతాలను గూర్చి కూడ విన్నాడు. కనుక క్రీస్తుని కంటితో చూడాలనీ అతని