పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/112

ఈ పుట ఆమోదించబడ్డది

చెంపలపై బాది నిన్ను కొట్టిందెవరో ప్రవచించమన్నారు. యేసు తాను మెస్సియానని చెప్పకొన్నాడు కదా! మెస్సీయాకు ప్రవచనశక్తి వుంటుంది. కనుక అతడు తన ప్రవచన శక్తిని చూపించాలని ఇక్కడ సభ్యుల భావం.

యూదుల న్యాయసభ సభ్యులు క్రీస్తుని విశ్వసించడానికి బదులుగా అతనికి శత్రువులయ్యారు. అతన్ని అపహాసం చేసారు. నేడు కూడ క్రీస్తు సందేశాన్ని విన్నవాల్లెవరూ ఉదాసీనంగా ఉండిపోరు, వాళు క్రీస్తుని నమ్మి అతని భక్తులైనా ఔతారు, లేదా అతన్ని ప్రతిఘటించి శత్రువులైనా ఔతారు.

2. పేత్రు బొంకు - 26,69–75

యేసు న్యాయసభ ముందు తాను మెస్పీయానని బాహాటంగా ప్రకటించాడు. కాని పేత్రు అదే సభముందు తాను క్రీస్తు శిష్యుణ్ణని ధైర్యంగా చెప్పకోలేకపోయాడు. ఇక్కడ ప్రభువు ధైర్యానికీ పేత్రు పిరికితనానికీ వున్న వ్యత్యాసాన్ని పాఠకులు జాగ్రత్తగా గమనించాలి.

"యేసుతో" వున్నందుకు దాసి పేత్రు మిూద తప్పపట్టింది - 26,69, శిష్యుని ధర్మం గురువుతో ఉండడం గదా! పేత్రు ఆమె మాటలకు దడిసి అమ్మా! నీ పలుకుల భావమేమిటో నాకు అర్థం కావడం లేదు అని పల్మాడు. అలా అతడు ఆమె నుండి తప్పించుకోజూచాడు. ఈలా అతడు మొదటిసారి బొంకాడు. అంతకు ముందు అతడు నేను నీతో మరణించవలసి వచ్చినా నిన్నెరుగనని బొంకను అని క్రీస్తుతో చెప్పిన మాటలను పూర్తిగా మర్చిపోయాడు -26,35. ఇక ఆ యింటి ప్రాంగణంలో ఉండలేక తత్తరపాటుతో ఇంటి ద్వారం వద్దకు వచ్చాడు. అక్కడ మరో దాసి నీవుకూడ ఆ నజరేయుని శిష్యుడవు కాదా అని అతన్ని నిలదీసింది. ఇక్కడ మొదట బొంకినప్పటికంటే ఎక్కువ మంది జనులున్నారు. వారందరిముందు నేను క్రీస్తుని ఎరగనే ఎరగనని రెండవసారి బొంకాడు. అలా బొంకి ఒట్టగూడ వేసికొన్నాడు. క్రీస్తు ఒట్టు వేసికోవద్దని ఖండితంగా చెప్పాడు. కయిఫా ఒట్టు పెట్టినా పేత్రు ఒట్టు పెట్టినా అది తప్పే

ఈ రెండు సంఘటనలు జరిగాక కూడ పేత్రు ఆ తావు నుండి వెళ్ళిపోలేదు. క్రీస్తు పట్ల వున్న భక్తిభావం వల్ల కాబోలు ఇంకా అక్కడే శత్రువుల మధ్యనే ఉండిపోయాడు, ఇంతలో అక్కడివాళ్ళంతా పేత్రు చుటూ గుమిగూడారు. వాళ్లు పూర్వం కంటె ఇంకా పెద్ద గుంపయ్యారు. నిక్కంగా నీవు కూడ అతని అనుచరుడవే. నీ ఉచ్చారణమే నీవు గలిలయుడవని నిరూపిస్తుంది అని దబాయించారు - 26,74, గలిలయ రాష్ట్రంవాళ్లు అరమాయిక్ భాషను ఒకలాగ ఉచ్చరించేవాళ్లు. కనుక యూదయా రాష్ట్రంవాళ్లు