పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/101

ఈ పుట ఆమోదించబడ్డది

1. గెత్సెమని ప్రార్ధనం - 26, 36-46

నూత్న వేదంలోని అతి ప్రశస్త భాగాల్లో ఇదీ వొకటి. ఈ భాగాన్ని మోకాళ్ళమిూద వుండి చదువుకోవాలి. చదువుకొని భక్తిభావంతో ప్రభుని ఆరాధించాలి. గెత్సెమని అంటే ఓలివు చమురుతీసే గానుగ. ఇది ఓ ఓలివు తోట. దీని యధికారి క్రీస్తుకి స్నేహితుడై యుండవచ్చు. కనుకనే ప్రభువు ఇక్కడికి చాలసారులు శిష్యులతో వచ్చి నిరాటంకంగా ప్రార్థన చేసికొని పోతూండేవాడు. ఈ తోట కిద్రోను లోయలో, ఓలివు కొండకు ఆనుకొని వుంది.

ప్రభువు శిష్యులతో ఈ తోటకు వచ్చాడు. నేను అల్లంత దూరంపోయి ప్రార్ధన చేసికొని వస్తాను. మిూరిక్కడనే కూర్చొనండి అని శిష్యులతో చెప్పాడు. పూర్వం ఈసాకుని మోరీయా కొండకు తీసికొని పోయిన అబ్రాహము కూడ తన పనివారితో "మిరిక్కడనే వుండండి. నేను చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కులు చెల్లించుకొని తిరిగి వస్తాం” అని చెప్పాడు - ఆది 22.5. బైబుల్లో ఈసాకు క్రీస్తుకి పోలికగా వుంటాడు, క్రీస్తు విశ్వాసం అబ్రాహాము విశ్వాసాన్ని మించింది.

ప్రభువు పదకొండు మంది శిష్యులను తోటలో ఒక తావున ఆపి ముగ్గురుని మాత్రం తనతో తీసికొని ముందుకి వెళ్లాడు. ఈ ముగ్గురు పేత్రు యాకోబు యోహాను, వీరికి శిష్యుల్లో ఓ ప్రత్యేక స్థానం వుంది. అతడు వీరినే మొదట పిల్చాడు - 4,18–22. వీళ్ళు మాత్రమే తబోరు కొండమిూద క్రీస్తు మారురూపం తాల్చినపుడు అతనితో పాటు వున్నారు - 17,1-8. కొండమిూద క్రీస్తు తేజస్సును చూచిన ఈ ముగ్గురు ఇప్పడు క్రీస్తు తాగబోయే పాత్రను కూడ చూస్తారు. ఆ పాత్రను తాము కూడ తాగితేనే గాని క్రీస్తు మహిమను స్వీకరించలేరు - 20,22-83,

తోపులో ప్రభువు చింతాక్రాంతుడై ఆవేదన పడసాగాడు - 26,37. ఈ వాక్యం 42వ కీర్తనలోని "ప్రభూ! నేను విచారంలో మునిగి నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాను" అనే 6వ చరణాన్ని స్మృతికి తెస్తుంది. ప్రభువు ఇక్కడ ఈ 42వ కీర్తనను జపించి ఉండవచ్చు కూడ. అతడు శిష్యులతో నా యాత్మ మరణ వేదనను అనుభవిస్తూంది అని చెప్పాడు, ప్రభువుకి మరణ సమయం సమిూపంలోనే వుంది. కనుక మరణించే వ్యక్తికి ఎంత వేదన కలుగుతుందో అతనికీ ఈ సమయంలో అంత వేదన కలిగిందనుకోవాలి.

మామూలుగా మనం మన ప్రసంగాల్లో విన్నట్లుగా క్రీస్తుకి ఇక్కడ ఆవేదన కలిగించింది భావికాలంలో మనం చేయబోయే పాపాలు కాదు. అతడు దేవుని కుమారుడైనా