పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/97

ఈ పుట ఆమోదించబడ్డది

6.క్రీస్తు సిలువ

బైబులు భష్యం - 136

మనవిమాట

ఈ సంచికలో సిలువ చరిత్రను వివరించాం. క్రీస్తు రాకముందు, క్రీస్తు జీవితంలో, అతని మరణానంతరం సిలువ చరిత్ర ఏలా వుండేదో తెలియజేసాం. సిలువ నూత్న వేదంలోని ప్రధాన భావాల్లో వొకటి. క్రైస్తవ జీవితంలోని ముఖ్యాంశాల్లో వొకటి. కనుక ఈ పదమూ, దాని భావమూ మన ప్రజలకు స్పష్టంగా తెలిసివుండాలి. ఈ సంచికలోని నాలు ముఖ్యాంశాలు ఇవి:

1. ప్రాచీనకాలంలో సిలువ మరణం

2. క్రీస్తు సిలువ మరణం

3. సిలువ మరణంలోని అంతరార్థం

  • . క్రీస్తు జీవితంలో సిలువ
  • . క్రైస్తవుల జీవితంలో సిలువ

4. సిలువ భక్తి

1. ప్రాచీనకాలంలో సిలువమరణం

మధ్యధరాసముద్ర తీర దేశాల్లో దోషులకు సిలువ మరణాన్ని విధించడం వాడుకలో వుండేది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంనుండి క్రీస్తుశకం 3వ శతాబ్దం వరకు ఈ శిక్ష కొనసాగింది. రోమను చక్రవర్తి కోన్స్టంటయిను క్రైస్తవుడయ్యాక 337లో ఈ శిక్షను రద్దుచేసాడు. క్రీస్తుసిలువపై చనిపోయినందున ఆ ప్రభువు గౌరవార్థం ఈ శిక్షను రద్దు చేస్తున్నానని ఆ రాజు ప్రకటించాడు.

సిలువ మరణం అతి ఘరమైంది. అది దోషులను కఠినంగా శిక్షిస్తుందనీ, ఇతరులనుగూడ భయపెట్టి నేరానికి దూరంగా వుంచుతుందనీ ప్రాచీనులు భావించారు. ఈ శిక్షలో దోషిని నిలువుగా పాతిన పొడగాటి మానుకి అంటగట్టి చావనిచ్చేవాళ్ళు మొదట దోషిని వెల్లకిలపరుండబెట్టి అతని చేతులను అడ్డమానుకి అంటగొట్టేవాళ్లు దోషితోపాటు ఆ మానుని పైకెత్తి నిలువుగా వున్న మానుకి బిగించేవాళ్ళు. నిలువుమాను ఎప్పడూ కొరతవేసే తావులోనే వుండేది. దోషి పిరుదులను ఆనించుకోవడానికి నిలువమానిపై ఓ పీట కూడ వుండేది. ద్రోహి కొంతకాలం మానుపై వేలాడి ఆకలిదప్పులకు గురై, ఆయాసం వలన ఊపిరాడక చనిపోయేవాడు.