పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/91

ఈ పుట ఆమోదించబడ్డది

పడద్రోయబోయినపుడు అతడు వారిమధ్య నుండి తొలగిపోయాడు - లూక 4,29-30. క్రీస్తు లాజరుని జీవంతో లేపి జనాన్ని తనవైపు ఆకర్షించు కొన్నప్పటినుండి యూద నాయకులు అతన్ని నాశం చేయాలని నిశ్చయించుకొన్నారు. కాని ప్రభువు వారి కంటబడకుండ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు - యోహా 11,53-54. ఐతే తండ్రి నిర్ణయించిన గడియ వచ్చినపుడు అతడు తండ్రిమీదనే భారంవేసి మరణాన్ని అంగీకరించాడు. ఈలా అతడు మనం మొదట శ్రమలను తొలగించుకోవాలనీ, తోలగించుకోలేనపుడు దేవుణ్ణి నమ్మి వాటిని మంచిమనసుతో స్వీకరించాలనీ బోధించాడు.

నేడు క్రీస్తు శిష్యులుమైన మనం ఈ బోధల విషయంలో రెండు పొరపాట్ల చేయవచ్చు. మొదటిది, బాధలు వాటంతట అవి మంచివో అన్నట్లు వాటిని ఆహ్వానించడం. వేదనలు అనుభవించడమే గొప్ప పుణ్యం అనుకోవడం. ఐతే ఈ పొరపాటుని కొద్దిమంది మాత్రమే చేస్తారు. రెండవది, శ్రమలు తప్పనిసరియైనపుడు గూడ వాటిని నిరాకరించడం. నిరాశకు గురై దేవుణ్ణి తిట్టిపోయడం. ఈ పొరపాటుని చాలమంది చేస్తారు. క్రీస్తు జీవితంలో ఆనందమూ బాధలూ రెండూ ఉన్నాయి. జీవమూ మరణమూ కూడ అతనిలో నెలకొని ఉన్నాయి. నేడు మన జీవితం కూడ ఈలాగే ఉండాలి.

ప్రభువు బోధలనుగూర్చి చెప్పే సందర్భంలో లైంగికాంశాలను గూర్చి కూడ రెండుమాటలు చెప్పాలి. తిరుసభ అధికారులందరూ బ్రహ్మచర్యాన్నిపాటించేవాళ్లే. కనుక వివాహం లైంగిక విలువలు తక్కువని, బ్రహ్మచర్యం ఎక్కువది అనేభావం మన క్యాతలిక్ సమాజంలో చాలమందికి ఉంది. తిరుసభకూడ మోహా తలంపులు, ముష్టిమైథునం, స్వలింగ సంపర్కం, వివాహేతరలైంగిక సంబంధాలు, కుటుంబనియంత్రణ మొదలైన అంశాలను గూర్చి పదేపదే హెచ్చరిసూంటుంది. బహుశా అవసరమైన దానికంటె ఎక్కువగానే ఉపదేశిస్తూంటుంది. కాని క్రీస్తు ఈ లైంగిక సమస్యలనుగూర్చి చెప్పింది చాలా తక్కువ. అతని బోధల్లో లైంగికాంశానికి అసలు తావున్నట్లే కన్పించదు. అతడు ఒక్కసారిమాత్రం శారీరక వ్యభిచార్యాన్ని మానసిక వ్యభిచారాన్నీ కూడ నిషేధించాడు అంతే - మత్త 5,28. ఇంతకుమించి క్రీస్తు లైంగిక విషయాలను నేరుగా ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రభువు స్వయంగా బ్రహ్మచారి. ఐనా అతడుగాని, అతని సమకాలికులుగాని ఆ విషయాన్ని ఘనంగా ఎంచలేదు. వ్యభిచార దోషంలో చిక్కుకొన్న స్త్రీలనుగూడ అతడు కఠినంగా మందలించలేదు. కరుణతో వారి తప్పిదాలనూ బలహీనతలనూ మన్నించి వారిని మరల త్రోవకు తీసికొనివచ్చాడు. కనుక నేటి తిరుసభ లైంగికాంశాలనుగూర్చి ఎక్కువగా చెప్పనక్కరలేదేమో! వీటికంటె సాంఘిక అన్యాయం, సోదరప్రేమ మొదలైనవి ముఖ్యమైనవి. ఈలాగంటే మనం లైంగిక విషయాల్లో విచ్చలవిడిగా