పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/83

ఈ పుట ఆమోదించబడ్డది

5. క్రీస్తూ-శిష్యుడూ

బైబులు భాష్యం - 126

విషయసూచిక

1.క్రీస్తు జీవిత విధానం

2.క్రీస్తు బోధలు

3.మనం చేసే పొరపాట్ల

4.క్రీస్తుతో స్నేహం

ప్రభువు మనలను రక్షించాడు కదా! దాని పర్యవసానంగా నేడు మనం తన్ను అనుకరించాలని అతని కోరిక. అతడు ప్రారంభించిన రక్షజోద్యమంలో మనం కూడ తనతో కలసి పనిచేయాలని అతని అభిలాష. అతడు దైవరాజ్యాన్ని ప్రారంభించాడు. నేడు దాన్ని వ్యాప్తిచేయవలసింది మనమే. క్రీస్తు పనిని కొనసాగించేవాడు క్రీస్తు శిష్యుడు, బైబుల్లో శిష్యుడు అంటే నేర్చుకొనేవాడు. క్రీస్తునుండి మనం అతని బోధలూ అతని జీవిత విధానమూ నేర్చుకోవాలి. వాటిని పాటించాలి, అ పిమ్మట వాటిని ఇతరులకు కూడ నేర్పించాలి. అనగా శిష్యుడు లోకంలో క్రీస్తునీ అతని ధర్మాన్నీ వ్యాప్తిచేయాలి. ఉత్థాన క్రీస్తుతో కలసి కృషిచేసి ప్రపంచాన్ని మంచికి మార్చాలి. మనం తరచుగా క్రీస్తుని నమ్ముతాం, ఆరాధిస్తాం. అతనికి ప్రార్ధన చేసికొంటాం.

కాని ఈ మాత్రమే చాలదు. ఇది సగం శిష్యత్వం మాత్రమే. పూర్ణశిష్యుడైనవాడు ఇతరులకు కూడ ప్రభువుని పరిచయం చేస్తాడు. శిష్యత్వంలో ప్రేషిత సేవకూడ ఇమిడివుంది.

ఈ పొత్తంలో మొదట క్రీస్తు జీవిత విధానాన్ని పరిశీలిద్దాం. అటుపిమ్మట అతని బోధలను తిలకిద్దాం. తదనంతరం శిష్యులంగా మనం చేసే పొరపాట్లను కొన్నిటిని జ్ఞప్తికి తెచ్చుకొందాం. కడన క్రీస్తుతో స్నేహాన్ని ఏర్పరచుకొనే విధానాన్ని తెలిసికొందాం.

1. క్రీస్తు జీవిత విధానం

ప్రభువు జీవితాన్ని పరిశీలిస్తే ప్రధానంగా నాల్గంశాలు కన్పిస్తాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. అతడు దేవుని కొరకు జీవించాడు

క్రీస్తు జీవిత విధానంలోని ముఖ్యాంశం దేవుని కొరకు జీవించడం. అతడు దేవుణ్ణి నాన్ననుగా (అబ్బ) అనుభవానికి తెచ్చుకొన్నాడు. అతన్ని నాన్నాఅని సంబోధించాడు. అతని దృష్టిలో భగవంతుడు నాన్న అమ్మకూడ. కనుక దేవుణ్ణి నాన్న అనికాని అమ్మ అని