పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/72

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువులో పూర్వవేద బోధలన్నీ నెరవేరాయి. మోషే ధర్మశాస్త్ర మంతా, పూర్వుల పారంపర్య బోధలన్నీ అతనిలో ఫలసిద్దినందాయి. పూర్వబోధలన్నీ అతని యందు మానవాకారం చేసికొన్నాయి. కనుక శిష్యులు మల్లా అతని బోధలను ప్రచారం చేయరు. ఆ బోధలకు ఆధారమైన యేసు అనే దివ్యమూర్తి జీవితానికిమాత్రం వాళ్ళు సాక్షులుగా వుంటారు. ఆ దివ్యని జీవితంలో గూడ ముఖ్యమైన ఘట్టాలు రెండు - మరణమూ, ఉత్తానమూ, క్రీస్తు మనలను రక్షించింది వీటిద్వారానే. కనుక శిష్యులు ప్రప్రథమంగా ప్రభువు మరణోత్తానాలకు సాక్షులు, జనులు ఆయన మరణోత్తానాలను స్మరించుకొని పాపాలకు పశ్చాత్తాపపడి క్షమాపణం పొందాలని బోధించేవాళ్ళు - లూకా 24, 47-48. ఈలా క్రీస్తు జీవితానికి సాక్షులుగా వుండడం అతని శిష్యులకు ప్రత్యేకమైన బాధ్యత. రబ్బయిల శిష్యులకెవరికి ఈ పూచీ లేదు.

10. ఇంకా కొన్ని వ్యత్యాసాలు

పూర్వాంశాల్లో రబ్బయిల శిష్యులకూ క్రీస్తు శిష్యులకూ వుండే వ్యత్యాసాలను పరిశీలించాం. ఆలాంటి భేదాలు ఇంకా కొన్ని వున్నాయి. 1. రబ్బయిలు స్త్రీలను శిష్యురాళ్ళనుగా అంగీకరించలేదు. వాళ్ళస్త్రీలకు అసలు ధర్మశాస్తాన్ని బోధించనే గూడదు అన్నారు. కాని క్రీస్తు ఈ పద్ధతికి భిన్నంగా పోయాడు. అతని శిష్యుల్లో స్త్రీలుకూడ కొంతమంది వున్నారు — లూకా 8, 2-3. బెతనీ గ్రామంలో మరియు ప్రభువు పాదాలచెంత కూర్చుండి అతని బోధను ఆలించినట్లుగా చదువుతూన్నాం. ఈ మరియ ప్రభువు శిష్యురాలు కనుకనే ఆగురువు చరణ సన్నిధిలో కూర్చుండి అతని ఉపదేశాన్ని భక్తిభావంతో ఆలించింది - లూకా 10,39. 2. రబ్బయిల శిష్యులు టోరాను నేర్చుకోవడానికి వచ్చారు. ఆలాగే సోక్రటీసు ప్లేటోల్లాంటి గ్రీకు విద్వాంసుల శిష్యులు విజ్ఞానాన్ని ఆర్థించడానికి వచ్చారు. కాని క్రీస్తు శిష్యులు విజ్ఞానార్ధనం కోసంగాక, చిన్న బిడ్డల్లా తయారు కావడంకోసం గురువు దగ్గరికి వచ్చారు - మత్త 18,3. ఇక్కడ శిష్యులు చిన్నబిడ్డల్లా తయారు కావడమంటే ప్రభువు మీద ఆధారపడ్డం. వినయాన్ని అలవర్చుకోవడం. దీనాత్ములు కావడం. ఈ వొక్కఅంశాన్ని బట్టే క్రీస్తు శిష్యులకూ ఇతర గురువుల శిష్యులకూ ఎంత వ్యత్యాసం వుందో గుర్తించవచ్చు. 8. స్నాపక యోహాను శిష్యులకు యోర్గాను స్నానం గుర్తు పరిసయుల శిష్యులకు ముఖపట్టికలు గుర్తు. క్రీస్తు శిష్యులకు గురేమిటి? సోదరప్రేమ. దీన్నిబట్టే లోకం మనలను ఆ ప్రభువు అనుచరులనుగా గుర్తిస్తుంది. లోకంలో వుంది సోదరప్రేమ కాదు, పరపీడనం. నరునికి నరుడు తోడేలు - ఇది లోకం వాలకం. ఆలాంటప్పుడు ఎవరైనా సోదరప్రేమతో