పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/61

ఈ పుట ఆమోదించబడ్డది

అతని సాన్నిధ్యం షెకీనా, బైబులు కొన్నిసార్లు దేవుని ఆత్మే అతని సాన్నిధ్యం అనికూడ చెప్తుంది. కనుక కొన్ని తావుల్లో రువా, షెకీనా కలసిపోతాయి - కీర్తన 139,7.

దైవసాన్నిధ్యం ప్రధానంగా దేవళంలో వుంటుంది - నిర్గ 25,8. సోలోమోను దేవాలయం కట్టి ప్రతిష్టించాక ఈ షెకీనా ఆ మందిరంలో నెలకొంది - 1 రాజు 8, 11. ధర్మశాస్రాన్ని బోధించేకాడ షెకీనా ఉంటుందని రబ్బయుల నమ్మకం. ఇంకా, అది నరులమధ్య నరులతో ఉంటుంది.

కాని షెకీనా ఏంచేస్తుంది? నరుల అంతరంగంలో దివ్య ప్రేరణలు పట్టిస్తుంది. వారి చేత మంచి పనులు చేయిస్తుంది.

దేవుని సాన్నిధ్యంగూడ దేవుని ఆత్మలో ఓ భాగమే. ఈయాత్మనే బైబులు దేవుని ముఖం, దేవుని దూత, దేవుని మేఘం, దేవుని సాన్నిధ్యం అని నానారూపాలతో పిలుస్తుంది. దేవుని ఆత్మ మనకు చేసిపెట్టే పనులుకూడ నానారూపాల్లో ఉంటాయి. ఆ యాత్మ మనకు నూత్నత్వాన్ని దయచేస్తుంది. మనలను ఐక్యపరుస్తుంది. మనకు చికిత్స చేస్తుంది. మనలో మార్పు తెస్తుంది. మనలో వసిస్తుంది. కనుక ఆ దివ్యాత్మ పట్ల మనకు భక్తి అత్యవసరం.

హోక్మా రువా, షెకీనా అనే పదాల ద్వారా పూర్వవేదం దేవుణ్ణి స్త్రీమూర్తినిగా చిత్రిస్తుందని మనం తెలిసికోవలసిన అంశం.

ఇంతవరకు మనం చూచిన భావాల సారాంశం ఇది. యూదులు దేవుణ్ణి స్త్రీమూర్తినిగా, తల్లినిగా భావించారు. కనుక మన ప్రార్ధనంలో మనం అతన్ని ఎప్పడూ తండ్రినిగానే భావించుకోనక్కరలేదు. తల్లినిగా గూడ భావించి జపం చేసికోవచ్చు. అతన్ని అమ్మా! అని పిలువవచ్చు. అమ్మ మనకు ప్రీతికరరమైన వ్యక్తి పవిత్రమైన వ్యక్తి. ఆ పవిత్ర భావాన్ని దేవునికిగూడ ఆరోపిస్తే అతడు తప్పక సంతోషిస్తాడు.

2. నూత్న వేదం

నూత్న వేదంలో దేవుణ్ణి తల్లిగా భావించిన సందర్భాలు కొద్దిగానే ఉన్నాయి. నాలు తావుల్లో మాత్రం నూత్నవేదం దేవుణ్ణి తల్లితో ఉపమిస్తుంది. వీటిల్లో రెండు యావే ప్రభువుకి చెందినవి. ఒకటి క్రీస్తుకీ ఇంకొకటి పవిత్రాత్మకీ చెందినవి. ఇక ఈ నాలు సందర్భాలను పరిశీలిద్దాం.

1. గృహస్తురాలుగా దేవుడు

క్రీస్తు మామూలుగా యావే ప్రభువుని అబ్బ (నాన్న) అని పిల్చేవాడు. అతనికి పుంలింగాన్నేవాడేవాడు. రెండు తావుల్లో మాత్రం అతన్ని స్త్రీనిగా పేర్కొన్నాడు. మొదటిది