పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/44

ఈ పుట ఆమోదించబడ్డది

చనువూ పెంచుకోవాలి. క్రీస్తుకి తండ్రిపట్ల వున్న అనుభూతి మనకుకూడ కొంతవరకైనా కలగాలి. తొలినాటి క్రైస్తవుల అనుభవం మన అనుభవం కావాలి. పరలోకంలో మనకో నాన్న వున్నాడనే భావం మనకు బాగా ప్రేరణం పుట్టించాలి. అబ్బా అనే పదాన్ని మనం ఓ సుకృత జపంగా వాడుకోవాలి. అది మనకు ఓ మంత్రం కావాలి. 3. ఏలాంట్టి తండ్రి ?

భూలోకంలోని పిల్లలు తమ తండ్రిని చూచి సంతోషిస్తారు. ఇంతకంటె అదనంగా క్రీస్తు తన తండ్రిని చూచి సంతోషించాడు. అందరు తండ్రులకంటె ఆ తండ్రి ఇంకా గొప్పవాడుకదా! ఒకమారు క్రీస్తు భూలోకంలోని తండ్రులను ఉద్దేశించి మీరెంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మేలి వస్తువులను ఇస్తారుకదా! పరలోకంలోని తండ్రి మీకు ఇంకెంతటి మేలి వస్తువులను ఇస్తాడో ఊహించండి అన్నాడు -మత్త7,11. భూలోకంలోని జనకులకూ పరలోకంలోని జనకునికి అంత వ్యత్యాసం వుంది. ఆ జనకుడు తండ్రీ దేవుడూ కూడ.

మన భాషలో తండ్రి అనగానే కుమారుణ్ణి ఊహించుకొంటాం. క్రీస్తుకూడ దేవుణ్ణి తండ్రి అని పిల్చినపుడు తన జననాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. పరిశుద్ధ త్రీత్వంలో పిత సుతునికి పుట్టువునిచ్చాడు. మానుష క్రీస్తుకికూడ తండ్రి పుట్టువునిచ్చాడు. యావే జీవనమే నజరేతూరి యేసులోకూడ కన్పించింది. కనుక యావే అతనికి రెండు విధాల తండ్రి, కనుక క్రీస్తు అతన్ని పరమ ప్రేమభావంతోనే తండ్రి అని పిల్చాడు. అతడు నా తండ్రి నాకు సమస్తము ఇచ్చాడు అన్నాడు – మత్త 11,27. అతనికున్నవన్నీ తండ్రినుండి వచ్చినవే.

ఇంకా, అతడు నా తండ్రి నాకంటె గొప్పవాడు అన్నాడు - యోహా 14,28. తాను తండ్రినుండి జన్మించాడు కనుక తండ్రి తనకంటె గొప్పవాడు. ఐనా అతడు దేవునితో సరిసమానుడు. కనుకనే అతడు నీకున్నదంతా నాది, నాదంతా నీది అన్నాడు - యోహా 17,10. ఇంకా నా తండ్రి నేను ఏకమైయున్నాం అనికూడ చెప్పాడు – 10,0. అతని బోధల్లో ఈ రెండంశాలు కన్పిస్తాయి. ఒక విధంగా అతడు తండ్రికంటె తక్కువవాడు, మరొకవిధంగా అతనికి సరిసమానుడు.

ఈ లోకంలోని పిల్లలకు వారి తల్లిదండ్రులు ఆదర్శంగా వుంటారు. తండ్రుల పోలికలూ అలవాటూ బిడ్డలకు వస్తాయి. క్రీస్తుకికూడ తన తండ్రి పద్దతివచ్చింది. అందుకే అతడు నా తండ్రి ఇంకను పనిచేస్తున్నాడు, నేనూ పనిచేస్తున్నాను అన్నాడు –5, 17. అనగా తండ్రి తన లోకసృష్టిని కొనసాగించుకొనిపోతున్నాడు. క్రీస్తు కూడ అద్భుతాల ద్వారా ఈ సృష్టిని కొనసాగించుకొని పోతున్నాడు. ఇంకా, తండ్రి ఏం జేస్తున్నాడో కుమారుడు కూడ దానిని అట్లే చేస్తాడు అన్నాడు - 5,19. భూలోకంలో పిల్లలు తమ తండ్రులు