పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

నేలలో పడిన గోదుమ గింజలాగ చివికిపోవాలి. అప్పడే మంచి ఫలితాన్ని ఇచ్చేది - 12.24. క్రీస్తు ఆలా చివికిపోయాడు. కనుక మనకూ అదే మార్గం.

5. ప్రార్థన చేసికోవాలి

క్రీస్తు శిష్యులతో మీరు నా పేరిట ఏమి అడిగినా నేను దాన్ని చేస్తాను అన్నాడు14, 13. అనగా మన ప్రార్థనను అతడు వింటాడని భావం. ఇంకా “మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా అతడు మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు – 16,23. కనుక తండ్రీకుమారులు ఇద్దరు మన మొర వింటారు. ఐతే క్రీస్తు మన మొర ఆలించాలంటే మనం ఆయన ఆజ్ఞలు పాటించాలి. అతని చిత్త ప్రకారం జీవించాలి. అతనికి విధేయులం కావాలి. ఈ లక్షణాలు కలవారి విన్నపాలను క్రీస్తూ తండ్రీ తప్పక వింటారు.

4. దైవ కటాక్షం

1. సొంత కుమారునే సమర్పించిన తండ్రి

దేవుణ్ణి ప్రేమించేవాళ్లకు అన్నీ మంచికే సమకూరుతాయి అన్నాడు పౌలు భక్తుడు - రో 8,28. మన తరపున మనం దేవుణ్ణి ప్రేమిస్తే చాలు, అతని దయవల్ల అన్ని సంఘటనలూ, మనకు మంచినే చేసిపెడతాయి. ఈజిపులో యోసేపుకి అన్నీ అనుకూలంగానే జరిగాయి కదా! మనకుకూడ ఆలాగే జరుగుతుంది.

దేవుడు తన సొంత కుమారునే మన కొరకు సమర్పించడానికి వెనుకాడలేదు. మరి ఇతర వస్తువులను ఉచితంగా ఈయడా? రోమా 8,32. తండ్రికి కుమారుడు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆలాంటి కుమారుట్టే మన కొరకు సమర్పించినపుడు ఇతర వస్తువులు ఏపాటివి? అన్ని భాగ్యాల కంటె క్రీస్తు గొప్ప భాగ్యం కాదా? కనుక అతడు మనకు అవసరమైనవన్నీ ఇస్తాడని నమ్మాలి. మన తరఫున మనకు ఆ తండ్రిపట్ల భక్తి నమ్మకమూ వుంటేచాలు.

ప్రభువు శిష్యులను మేము ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, ఏమి ధరిస్తాం అని కలత చెందవద్దన్నాడు. మన అవసరాలన్నీ ఆ తండ్రికి ముందుగానే తెలుసు అన్నాడుమత్త 6,31-32. అన్నపానీయాలు బట్టలు నరుని ప్రాథమికావసరాలు. ఐనా చాలమంది ఇవికూడ దొరక్క బాధపడిపోతుంటారు. కాని మనం దేవుణ్ణి నమ్మి అతని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే చాలు. అతని రాజ్యాన్ని ఆశిస్తే చాలు. ఈ ప్రాథమికావసరాలను అతడు తప్పక తీరుస్తాడు. అతడు మనకు పరలోక భాగ్యాలనూ భూలోక భాగ్యాలనూ గూడ దయచేస్తాడు.

నేను మిమ్ము జోలె, పాదరక్షలు లేకుండ పంపినపుడు మీకు ఏమైన కొరత కలిగిందా అని ప్రభువు శిష్యులను అడిగాడు. వాళ్ళు ఏ కొరత కలగలేదని జవాబు