పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

2. తండ్రి

                                                                                       బైబులు భాష్యం - 139
విషయ సూచిక

1.దేవుడు క్రీస్తుకి తండ్రి
2.దేవుడు విశ్వాసులకు తండ్రి
3.దేవుని బిడ్డల ప్రవర్తనం
4.దైవ కటాక్షం
5.అబ్బా" అనుభవం

ప్రభువు మరియు మగ్డలీనతో "నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు ఐనవానియొద్దకు ఆరోహణమైపోతున్నానని నీవు నా శిష్యులతో చెప్ప" అన్నాడుయోహా 20,27. యావే ప్రభువు క్రీస్తుకీ శిష్యులకూ కూడ తండ్రి. పైగా వాళ్లు అతనికి సోదరులు. ఇక్కడ మొదట తండ్రికీ క్రీస్తకీ వున్న సంబంధాన్ని పరిశీలిద్దాం. ఆ పిమ్మట శిష్యులకూ పితకుమారులకూ గల సంబంధాన్ని విచారిద్దాం.

1. దేవుడు క్రీస్తుకి తండ్రి

1. క్రీస్తూ తండ్రీ ఒకరియందొకరు నెలకొని వుంటారు.

నేను తండ్రియందు, తండ్రి నాయందు ఉన్నామని మీరు విశ్వసించండి - యోహా 14,11. క్రీస్తుకీ పితకూ వుండే సంబంధం క్రీస్తకీ శిష్యులకూ వుండే సంబంధం కంటె బలమైంది. పూర్వవేద ప్రజలకూ యావేకూ వుండే సంబంధంకంటె కూడ బలమైంది. కుమారుని జీవానికీ బోధలకూ అద్భుతాలకూ గూడ కేంద్రం పరమపితే - 14,10.

2. క్రీస్తూ తండ్రీ ఒకరినొకరు ప్రేమించుకొంటారు.

కుమారుడు తన ప్రాణాలను ధారపోస్తాడు కనుక పిత అతన్ని ప్రేమిస్తాడు - 10,17. కుమారుడు కూడ తండ్రిని ప్రేమించి అతడు ఆజ్ఞాపించిన సిలువ మరణానికి బదుడయ్యాడు - 1431. తండ్రికి తన పట్ల గల ప్రేమకు లొంగే, ఆ ప్రేమకు బదులు ప్రేమను చూపడానికే, క్రీస్తు సిలువ మరణాన్ని అంగీకరించాడు.

3. క్రీస్తు తండ్రి పరస్పర విధేయులు

తండ్రి చిత్తాన్ని నేరవేర్చి అతడు నియమించిన పనిని చేయడమే క్రీస్తుకి ఆహారం - 4,34. తండ్రి యిచ్చిన శ్రమల పాత్రను అతడు పానంజేసి తీరుతాడు- 18, 11.