పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/256

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తండ్రిలాంటివాడైన దేవుడు నరులు తనకు ఎడతెగక మొరపెట్టినపుడు వారి వేడికోలు తప్పక వింటాడు.

2. పట్టువీడక ప్రార్థన చేయాలనేది ఈ సామెతలోని ముఖ్యాంశం. ప్రార్థనను ప్రారంభిస్తేనే చాలదు. దాన్ని కొనసాగించుకొనిపోవాలి. చాలసార్లు దాన్ని మధ్యలోనే ఆపివేస్తాం. మన చిత్తచాంచల్యం దీనికి కారణం, ఈలాగైతే దేవుని వరాలు పొందలేం. వితంతువు న్యాయాధిపతివలన విసిగిపోయి అతన్ని అడగడం మానివేస్తే ఏమయ్యేది?

3. ఈ వితంతువు శ్రమ అనుకోకుండ తేపతేపకు న్యాయాధిపతికి మనవి చేసేది. చివరకు అతడు ఆమె కోరిక తీర్చాడు. ప్రార్థనలో మన చిత్తం దేవుని చిత్తంతో ఘర్షణ పడుతుంది. ఈ దృష్టిలో మన ప్రార్ధనం పోరాటం. జపంలో మనం శ్రమపడాలి. ఒలీవ తోపులో ప్రార్థన చేసినపుడు క్రీస్తు శ్రమపడ్డాడు - మార్కు 14, 36.

4. ఈ స్త్రీ న్యాయాధిపతికి నేరుగా, సరళంగా మనవి చేసింది. నాకు న్యాయం తీర్చు అని అడిగింది. ఈలాగే మన అవసరాల్లో మనం నేరుగా, సూటిగా దేవుణ్ణి అడగాలి. అదే మనవి ప్రార్ధనం. "మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి" అన్నాడు పౌలు - ఫిలి 4,6,

5. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనను వెంటనే వినడు. దీనికి అనేక కారణాలు వుండవచ్చు. మనమడిగింది మనకు హానిచేయవచ్చు. లేదా మనచేత మళ్లామల్లా అడిగించుకొని మన ఆశను పెంచడానికి కావచ్చు. పైగా, సులువుగా లభించిన దాన్ని విలువతో చూడం. కష్టంతో సాధించిన దానికి విలువనిస్తాం. ఇందుకు కావచ్చు.

32. సుంకరి పరిసయుడు = లూకా 18,9–14

1. తన పాపాలకు పశ్చాత్తాపపడే పాపిని దేవుడు క్షమిస్తాడు. నేను పుణ్యాత్ముణ్ణి అనుకొని తనమీద తానే ఆధారపడేవాడి తప్పలను మన్నించడు.

2. పరిసయని గర్వం ఏమిటి? అతడు ఇతరులతో పోల్చుకొని నేను మంచివాణ్ణి ఇతరులు దుర్మార్డులు అనుకొన్నాడు. ఈ యహంభావం పనికిరాదు. సుంకరుని వినయం ఏమిటి? అతడు ఇతరులతో పోల్చుకోలేదు. పవిత్రుడైన దేవనీవైపు చూచి నేను పాపిని అనుకొన్నాడు. నన్ను క్షమించు అని వేడుకొన్నాడు. ఇతరులతో నాకెందుకు, నా తప్ప నేనొప్పుకొంటాను అనుకోవడం వినయం.

3. నేను నీతిమంతుణ్ణి అనుకొన్న పరిసయుద్ధి దేవుడు అవినీతిమంతునిగా గణించాడు. నేను పాపిని అనుకొన్న సుంకరుని నీతిమంతుని జేసాడు. నాకు నేను పుణ్యాత్ముడ్డి అనుకొంటే చాలదు. దేవుడు నన్ను పుణ్యాత్ముణ్ణిగా లెక్కించాలి. మన మనో భావాలు (Feelings) మనలను అపమార్గం పట్టించవచ్చు.