పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/224

ఈ పుట ఆమోదించబడ్డది

3. జబెదయి కుమారులైన యాకోబు యోహానులు క్రీస్తు సింహాసనానికి కుడియెడమలందు కూర్చుండే భాగ్యాన్ని తమకు ప్రసాదించమని వేడుకొన్నారు. ప్రభువు నేను త్రాగే పాత్రను మీరు త్రాగగలరా అని ప్రశ్నించాడు - మార్కు 10, 38. ఇక్కడ ప్రభువు త్రాగే పాత్రం అతని సిలువపాల్లే యాకోబు యోహానులు తమకు పెద్ద పదవులు కావాలని కోరారు. కాని క్రీస్తు తన శ్రమల్లో పాల్గొనేవాళ్ళేగాని తనకు శిష్యులు కాలేరు అని వక్కాణించాడు.

4. ఇదే వాక్యంలో ప్రభువు నేనుపొందే జ్ఞానాస్నానాన్ని మీరు పొందగలరా అని ప్రశ్నించాడు. ఇక్కడ జ్ఞానస్నానం అన్నా ప్రభుశ్రమలే గ్రీకు భాషలో 'బాప్టిజో" అంటే నీటిలో మంచడం, కనుక నీటిలో మునిగినట్లుగా అతడు శ్రమల్లో మునిగి తేలుతాడు. క్రీస్తులాగే అతని శిష్యులుకూడ శ్రమల్లో పాలుపొందాలి అని భావం. ఈలా ఈ ఉపమాన వాక్యాలన్నీగూడ ప్రభు శ్రమలను సూచిస్తాయి.

ప్రశ్నలు

అధ్యాయం -1

1. తప్పిపోయిన గొర్రెసామెతలో సుంకరులకు "పాపాత్ములు" అని పేరెందుకు వచ్చింది? ఆనాటి యూద సమాజంలో వాళ్ళకు ఏలాంటి స్థానం ఉండేది?

2. తప్పిపోయిన కుమారుని సామెతను "కరుణాళువైన తండ్రి సామెత అనడం మేలు" — ఎందుకు?

3. పాపాన్ని గూర్చీ పశ్చాత్తాపాన్ని గూర్చీ బోధించడానికి తప్పిపోయిన కుమారుని సామెత ఏలా ఉపయోగపడుతుంది?

4. పరిసయుడు సుంకరి అనే సామెతకు సందర్భం ఏమిటి?

5. ద్రాక్షతోట యజమానుని సామెతను కారుణ్యపు సామెతల్లో ఎందుకు చేర్చాలి?

6. 'భగవంతునిలో వుందీ నరునిలో లేందీ దయాగుణం? - ఈ భావాన్ని బోధించడానికి క్షమింపనొల్లని సేవకుని సామెత ఏలా ఉపయోగపడుతుంది?

7. కారుణ్యపు సామెతలను ఆధారంగా తీసికొని పల్లెటూరి జనులకు బైబులు భగవంతుని కరుణా హృదయాన్ని ఏలా వివరించి చెప్పగలవు?

అధ్యాయం - 2

1. మంచి సమరయుని కథను ఆధారంగా తీసికొని చిన్నపిల్లలకు అక్కరలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలని ఏలా బోధిస్తావు?

2. పొలంలోని యిలు యుద్ధమూ - ఈ సామెత భావం ఏమిటి?

3. నడిరేయి వచ్చిన స్నేహితుడు అనే సామెతలో ముఖ్య పాత్ర యెవరు? ఎందుకు?