పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/222

ఈ పుట ఆమోదించబడ్డది

చేసినట్లవుతుంది. ఇంకా ఈ దేవాలయపు శుద్ధి క్రొత్తయుగాన్ని కూడ సూచిస్తుంది. ప్రభువుతోనే ఈ క్రొత్తయుగం ప్రారంభమైంది. ఈ భావాలన్నిటిని సూచిస్తూ ప్రభువు ఇక్కడ నటనపూర్వకంగా దేవాలయ శుద్ధికి పూనుకొన్నాడు.

2. పసిబిడ్డడు - మత్త 18, 1-4

రెండుమూడేండ్ల క్రీస్తు వెంట తిరగగానే శిష్యులకు తలమిూద కొమ్మలు మొలిచాయి. వాళ్లు తమలో ఎవడు గొప్పవాడని వాదోపవాదాలు చేయడం మొదలెట్టారు. ప్రభువు వాళ్ళకు వినయాన్ని బోధించడం కోసం ఓ చిన్న నటన చేసి చూపించాడు. ఓ చిన్నబిడ్డను గొనివచ్చి వాళ్ళ మధ్యలో నిల్పి మిరు ఈ చిన్నబిడ్డలా కావాలని చెప్పాడు. బిడ్డగుణం తల్లిదండ్రుల విూద ఆధారపడ్డం. అలాగే శిష్యులు గూడ మేము గొప్పవాళ్ళం అని తలంచడం మానుకొని నమ్మికతో పరలోకం లోని తండ్రి విూద ఆధారపడాలి. శిష్యుల కుండవలసిన లక్షణం దేవుని మిూద నమ్మిక గాని అహంభావం గాదు — ఇది యూ నటనం భావం.

3. జక్కయను దర్శించడం = లూకా 19, 5-10

ప్రభువు జక్కయ యింటికి వెళ్ళాడు. అతని పాపాలను క్షమించాడు. ఆ యింటికి రక్షణం వచ్చింది అని చెప్పాడు. ఇక్కడ క్రీస్తు జక్కయ పాపాలను పరిహరించడం ద్వారా జనులందరి పాపాలను మన్నించడానికి మెస్సీయా విజయం చేసాడని సూచించాడు. పాపక్షమాపణను ప్రసాదించే మెస్సియా కాలం రానే వచ్చిందని తెలియజేసాడు. కనుక ప్రభువు జక్కయను సందర్శించడం గూడ ఓ నటనాత్మకమైన సామెతే.

4. యెరూషలేమును గూర్చి విలపించడం - లూకా 19, 41-44

ప్రభువు యెరూషలేమును చూచి విలపించాడు. శత్రువులు నీలో రాతిమిూద రాతిని నిలువనీయరని పల్మాడు. నిన్ను నేలమట్టం చేసి నీ సంతానాన్ని సంహరిస్తారని నుడివాడు. క్రీస్తు చనిపోయాక ఓ పాతికేళ్ళకు, 74లో, టైటస్ అనే రోమను సైన్యాధిపతి వచ్చి యెరూషలేమను సర్వనాశం చేసాడు. కనుక యిక్కడ ప్రభువిలాపం యెరూషలేమునకు రానున్నదుర్గతిని సూచిస్తుంది. ఈ దుర్గతినే క్రీస్తు ఇక్కడ విలాప నటన ద్వారా సూచించాడు.

5. అంజూరపు చెట్టను శపించడం - మత్త 21, 18-20

ఓమారు యేసు బెతానియా గ్రామం నుండి యెరూషలేముకు వసూ ఆకలిగొని " పందేమైనా దొరుకుతాయేమోనని అంజూరం దగ్గరికి వెళ్ళాడు. కాని దాని మీద ఆకులు మాత్రం ఉన్నాయి. ప్రభువు ఇక నీవెన్నటికిని ఫలింపకుందువు గాక అని శపింపగా అది