పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/214

ఈ పుట ఆమోదించబడ్డది

కొద్దిగా మార్చి క్రైస్తవులకు అన్వయించే అర్గాన్ని చేర్చాడు. S:Í5 భక్తులు రెండ రాకడకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. చాల సామెతల్లో ఈలాంటి మార్పులు జరిగాయని ముందే చెప్పాం.

8.అన్వయం

ప్రభువు రెండవ రాకడ లోకాంతంలో జరుగుతుంది. కాని లోకాంతం వరకు మనమంతా బ్రతికివుండం. అలాంటప్పుడు మనకు రెండవ రాకడతో సంబంధం ఏమిటి? ఎవరి మరణమే వారికి రెండవ రాకడ ఔతుంది. మరణించగానే మనం ప్రభువుని కలిసికొంటాం గదా! ఆ కలయికే మనకు రెండవ రాకడగా పరిణమిస్తుంది. ఇక, ఈ మరణమనేది ఎప్పడు వస్తుందో మనకు తెలియదు. కనుక మనం సిద్ధంగా ఉండాలి. ప్రభువు రాకడకు రోజురోజు పూర్తిగా తయారై యుండాలి.

5. ముగ్గురు సేవకులు - మత్త 25, 14-80

1. వివరణం

ఓ యజమానునికి ముగురు సేవకులు ఉండేవాళ్ళు. ఇద్దరు జాగ్రత్తగా మెలిగేవాళ్ళూ ఒకడు సోమరిపోతూను. యజమానుడు దూరదేశం వెళూ ఒకడికి ఐదు లక్షలూ, ఒకడికి రెండు లక్షలూ, ఒకడికి ఒక లక్షా మూలధనం ఇచ్చిపోయాడు. అతినికి తన మూలధనం మీద ఆదాయం సేకరించాలనే కోరికా ఉంది. సేవకులను పరీక్షించాలనే ఉద్దేశమూ వుంది.

సరే, మొదటి సేవకుడు ఐదు లక్షలతో వ్యాపారం చేసి పది లక్షలు గడించాడు. అలాగే రెండోవాడు కూడ తన డబ్బును ఇబ్బడి చేసాడు, యజమానుడు తిరిగివచ్చి లెక్కలు చూచి వాళ్ళిద్దరినీ మెచ్చుకొన్నాడు. ఇద్దరినీ బహూకరించి వాళ్ళకు పెద్ద ఉద్యోగాలు ఒప్పజెప్పాడు.

కాని ఈ కథలో ముఖ్యమైనవాడు మూడవ సేవకుడు. ఇతడు కష్టపడి పనిచేయడానికి ఒప్పకోని సోమరిపోతు. కనుక ధనాన్ని పదిలంగా నేలలో పాతిపెట్టాడు. భద్రంగా ఉంచగోరిన డబ్బును భూమిలో పాతిపెట్టడం పూర్వకాలపు పాలస్తీనా ప్రజల ఆచారం. యజమానుడు ఈ మూడవవాణ్ణి కూడ లెక్క అడిగాడు. అతని సాకులు ఉండనే ఉన్నాయి. యజమానుడు చండశాసనుడనీ, వ్యాపారంలో నష్టం వస్తే తన కుత్తిక పటుకొంటాడేమోనని దడిసి ఆ సొమ్ము భద్రంగా ఉంచాననీ సాకులు చెప్పి తప్పకోజూచాడు. కాని యజమానుడు అతన్ని క్షమించలేదు. ఆ సొమ్మను వడ్డీకి ఇచ్చినాగాని కొంత ఆదాయం వచ్చేది గదా! ఇతడు ఆపాటి తేలిక పనికి గూడ పూనుకోలేదు. కనుకనే ఇతడు శిక్ష పొందాడు.