పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/210

ఈ పుట ఆమోదించబడ్డది

అంగీకరింపరు, ప్రజలనూ అంగీకరింపనీయరు. వాళ్ళ తమతో పాటు ప్రజలను కూడ పెడత్రోవ పట్టిస్తున్నారు - మత్త 15,14

4. తల్లిపక్షి రెక్కలు విప్పి తన పిల్లల విూద చాస్తుంది. శత్రుపక్షుల నుండి వాటిని కాపాడుతుంది. అలాగే మెస్సియా కూడ యూదప్రజలను కాపాడాలని కోరుకొంటున్నాడు. కాని వాళ్ళకు పోగాలం వచ్చి అతని మాట వినడం లేదు - మత్త 23,37.

5. మనలో పెద్ద లోపాలే ఉంటాయి. కాని వాటిని గమనించం, ఇతరుల లోపాలను వ్రేలెత్తి చూపబోతాం. ఇదేలా వుందంటే మన కంటిలోని దూలాన్ని గమనించకుండా ఎదుటివాడి కంటిలోని నలుసును గమనించినట్లుగా ఉంది. తప్పలెన్నువారు తమ తప్ప లెరుగరు గదా! యూద నాయకులు ప్రవర్తనం ఈలా వుంది — మత్త 7,3–5.

6. మనం ఏదో తప్ప చేస్తాం. కనుక ఇతరులు మన మిూద వ్యాజ్యెం తెచ్చారు. అలాంటప్పడు మనం శత్రువులతో వెంటనే రాజీ పడాలి. లేకపోతే కష్టాల పాలౌతాం. అలాగే ఇప్పడు మెస్సియా వచ్చి బోధిస్తున్నాడు. అతని బోధలను వెంటనే ఆలించి పరివర్తనం చెందాలి. లేకపోతే యూదులు నాశమైపోతారు - మత్త 5,25-26.

7. పూర్వం నీనివే ప్రజలు దుష్టజీవితం జీవిస్తూంటే యోనాప్రవక్త వెళ్ళి పశ్చాత్తాపపడమని బోధించాడు. అతని బోధలు ఆలించి వాళ్ళ పశ్చాత్తాపపడ్డారు. రక్షణం పొందారు. అలాగే క్రీస్తు కూడ ఇప్పడు ఓ యోనాలాగ బోధిస్తున్నాడు. కాని యూదులు మాత్రం ఈ ప్రవక్త బోధలను పెడచెవిని పెడుతున్నారు. మరి వీళ్ళకు రక్షణం ఏలా లభిస్తుంది? - మత్త 12, 38–41.

5. వేచి వుండాలి అని చెప్పే సామెతలు

క్రీస్తు సామెతల్లో కొన్ని వేచివుండాలి అనే భావాన్ని సూచిస్తాయి. దేనికోసం వేచివుండాలి? మొదటి శతాబ్దం లోని క్రైస్తవులు తమ కాలంలోనే క్రీస్తు మళ్ళా రెండవ మారు విజయం చేస్తాడని నమ్మారు. పౌలు కూడ తన జీవిత కాలంలోనే రెండవరాకడ జరుగుతుందని విశ్వసించాడు. కనుక క్రైస్తవ భక్తులు ఈ రెండవ రాకడ కొరకు భక్తి భావంతో వేచివుండాలి అనుకొన్నారు. ఈ భావాన్ని సూచించే సామెతలు ఎన్మిది దాకా ఉన్నాయి.

ఇవన్నీ కూడ మొదట క్రీస్తు యూదులకు చెప్పినప్పుడు "త్వరపడాలి" అనే వర్గానికి చెందిన సామెతలే. మెస్సియా కాలం వచ్చింది. దైవరాజ్యం ఆసన్నమయింది.