పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/197

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక, క్రీస్తు తర్వాత ఓ పాతికయేండ్లకు అతని బోధలు సువిశేషాలుగా వ్రాసినపుడు లూకా మత్తయి మొదలయినవాళ్లు ఈ సామెతకు మరో భావం చూపారు. మెస్సియా యూదులను ఆహ్వానించాడుగాని వాళ్లు అతని పిలుపును తిరస్కరించారు. ఆ యూదులకు మారుగా యూదేతరులైన క్రైస్తవులు దైవ రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ సామెత అంతటా విందును దైవరాజ్యంగా అర్థం చెసికొవాలి.

4. అన్వయం

"ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం" అన్నాడు పౌలు –2కొ 6,2. ఆనాడు యూదనాయకులను మల్లె ఈనాడు మనలనుగూడ ప్రభువు తన రక్షణాన్ని స్వీకరించమని అడుగుతున్నాడు. తన రాజ్యంలో ప్రవేశించమని కోరుతున్నాడు. అతని పిలుపును అందుకొనే పూచీ మనది. అనగా మనం హృదయం పవిత్రం చేసికొని ఆ ప్రభువు అనుచరులం కావాలి.

2. వివాహవస్త్రం లేని అతిథి - మత్త 22, 11-14

1. సందర్భం

ఈ సామెత మత్తయి సువార్తలో మాత్రమే కన్పిస్తుంది. అతడు దీన్ని పైవిందు సామెతలో రెండవ భాగంగా పేర్కొన్నాడు.

2. వివరణం

రాజు పేదసాదలనూ, మంచివాళ్ళనూ చెడ్డవాళ్ళనూ గూడా భోజనానికి పిలువగా వాళ్ళంతా వచ్చి విందారగిస్తూన్నారు. అప్పడు రాజు అతిథులను చూడ్డానికి వెళ్ళాడు. యూదుల సంప్రదాయం ప్రకారం విందు నడిపించే గృహస్థ అతిథులతో కూర్చుండి భుజించడు. అతిథులు భోంచేస్తుండగా తాను వాళ్ళ దగ్గరకువచ్చి అలా పలకరించి వెత్తాడు అంతే. ఇక్కడ రాజు అతిథుల వద్దకు వచ్చి చూడగా వాళ్ళల్లో ఓ అతనికి వివాహవస్త్రం లేదు. అతడు మురికి బట్టలు తాల్చివచ్చాడు. ఇక్కడ వివాహవస్త్రం అంటే ఏదో ప్రత్యేకమైన వస్త్రం కాదు. శుభ్రంగావున్న మామూలు బట్ట, అంతే ఈ యతిధి మరికి బట్టలతో ఎందుకు వచ్చాడు? అతడు విందుకు సంసిద్ధంగా లేడు. తలవని తలంపుగా పిలుపు విన్పించింది. ఆ పిలుపు విని ఉన్నవాడు ఉన్నపాటిన వచ్చాడు.

3. భావం

యూదుల భాషలో వస్త్రం రక్షణాన్ని సూచిస్తుంది. అందుకే యెషయా "ప్రభువు నాకు రక్షణ వస్తాన్ని కట్టబెట్టాడు. పుణ్యవస్తాన్ని తొడిగాడు" అంటాడు - 61,10. క్రీస్తు కూడ తాను కొనిరాబోయే రక్షణాన్ని వస్త్రంతో పోల్చాడు - మార్కు 2,21. కనుక ఇక్కడ