పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/189

ఈ పుట ఆమోదించబడ్డది

శిష్యులు కుటుంబపు గొడవలతో సతమతమౌతుండ కూడదు. లోకంలో ఉన్నవాళ్ళ లోకంలో ఉన్నవాళ్ళను సమాధి చేసికొంటారు. శిష్యులు మాత్రం దైవరాజ్య సంబంధమైన కార్యాల్లో నిమగ్నులు కావాలి - మత్త 8,21. ఇంకా నాగటి మేడిమిూద చేయిమోపి మళ్ళా వెనకతట్టుకు చూచేవాడు దైవరాజ్యానికి అరుడు కాడు - లూకా 9,62. అనగా శిష్యులు ఓమారు క్రీస్తుని అనుసరించడం మొదలు పెట్టాక ఇక సందేహించగూడదు.

ప్రపంచం బోధించే సిద్ధాంతాలు విశాలమైన మార్గం లాంటివ. కాని ఆ మార్గాన్ని బట్టి పోయేవాళ్లు వినాశనానికి గురౌతారు. క్రీస్తు బోధించే సిద్ధాంతాలు ఇరుకైన మార్గం లాంటివి. కాని అందరూ ఈ మార్గాన్ని ఎన్నుకోరు. ఐనా ఈ త్రోవ వెంట వెళ్లేవాళ్లు జీవాన్ని పొందుతారు. కనుక శిష్యులు ఈ యిరుకు త్రోవలోనే పయనం చేయాలి - మత్త 7, 13-14.

కడన శిష్యులకు మేము గొప్పవాళ్ళం అనే భావం పనికి రాదు. వాళ్లు చిన్నబిడ్డల్లాగ తయారు కావాలి. బిడ్డలు తల్లిదండ్రుల విూద ఆధారపడినట్లే వాళ్ళూ దేవుని మిూద ఆధారపడి జీవించాలి — లూకా 9,46-48. ఇవి ఉపమాన వాక్యాల్లో కన్పించే కొన్ని శిష్యధర్మాలు.

{{

center|3. దైవరాజ్యం

}}

ప్రభువు దైవరాజ్యాన్ని గూర్చి చాల సామెతలు చెప్పాడు. దైవరాజ్యమంటే దేవుడు ప్రజల జీవితంలోనికి అడుగుపెట్టడమే. భగవంతుడు మెస్సీయా ద్వారా తన ప్రజలతో సంఖ్యసంబంధాలు ఏర్పరచుకొంటాడు. కనుక దైవరాజ్యమంటే క్రీస్తు మన మంటివిూదకి దిగిరావడమే. ఆ ప్రభువు బోధించిన బోధల్లోనైతేనేమి, చేసిన అద్భుత కార్యాల్లోనైతేనేమి దైవరాజ్యం ఇమిడి ఉంది. అసలు అతడే దైవరాజ్యం అనాలి.

ఈ దైవరాజ్యం నరుల హృదయాల్లో నెలకొంటుంది. ఎవరు క్రీస్తుని అంగీకరించి విశ్వసిస్తారో వాళ్ళే దైవరాజ్యానికి చెందినవాళ్లు. ఈ దైవ సామ్రాజ్యం నిరాడంబరంగా, సద్దు చేయకుండా, మెల్లమెల్లగా వ్యాప్తిలోనికి వస్తుంది. దాని పెంపు చెట్టు పెరిగి పెద్దదైనట్లుగా, పైరు పంటకు వచ్చినట్లుగా, పులియబారిన పిండి పొంగినట్లుగా ఉంటుంది. బుద్ధిమంతులు ఈ రాజ్యానికి విలువనిస్తారు. దాన్ని ఓ నిధిలాగ, ఓ ముత్యంలాగ ఆదరంతో స్వీకరిస్తారు.

ఈ దైవరాజ్యాన్ని గూర్చిన సామెతలు సువిశేషాల్లో ఏడింటిదాకా ఉన్నాయి. వాటిని ఈ క్రింద క్రమంగా పరిశీలిద్దాం.