పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/181

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ రెండు సామెతల భావం ఇది. డబ్బంటేనే ఇల్లు కట్టడం ప్రారంభించాలి. బలముంటేనే శత్రురాజుని ఎదిరించాలి. అలాగే స్వార్థత్యాగం వుంటేనే క్రీస్తు శిష్యులం కావడానికి పూనుకోవాలి. లేకపోతే మానుకోవాలి. సగం పనిజేసి దాన్ని మధ్యలో ఆపివేయడం కంటె అసలు ఆ పనినే ప్రారంభించకుండా వుండడం మేలు. అలాగే క్రీస్తు శిష్యుడు మళ్లా స్వార్థజీవితం జీవించడం కంటె అసలు అతని శిష్యుడు కాకుండ వుండడమే మేలు.

3. అన్వయం

ఇది వినడానికి కొంచెం కటువైన సామెత. ఐనా మన గురువు సిలువ మార్గంలో నడచిపోయినవాడు. సిలువ మార్గమంటే స్వార్దాన్ని చంపుకోవడం. ఆ గురువు ఒక త్రోవలో పోతూంటే శిష్యులమైన మనం మరో త్రోవలో పోగూడదు. ఇక ఈ సిలువ మార్గంలో నడిచే శక్తి మనంతట మనకు అలవడదు. ప్రభువే ఆ శక్తిని మనకు ప్రసాదిస్తాడు. కనుకనే అతడు పౌలుతో "నా కృప నీకు చాలు. నీవు బలహీనుడవుగా వున్నపుడు నా శక్తి నీ మీద సమృద్ధిగా పని చేస్తుంది" అని చెప్పాడు- 2కొరి 12,9.

3. రాతి పునాది, ఇసుక పునాది - మత్త 7,24-27

1. సందర్భం

పర్వత ప్రసంగాంతంలో ప్రభువు తన బోధలను ఆలించడం మాత్రమే గాదు వాటిని పాటించడం గూడ అవసరమని సెలవిచ్చాడు. మంచి శిష్యుడు ప్రభు బోధలను ఆలించి వాటిని పాటిస్తాడు. చెడ్డ శిష్యుడు ప్రభు బోధలను ఆలిస్తాడే గాని పాటించడు.

2. వివరణం

ఓ తెలివైన జనుడున్నాడు. అతడు రాతిమిూద పునాది తీసి ఇల్లు కట్టాడు. పెనుగాలీ జడివానా వరదలూ వచ్చాయి. కాని పునాది భద్రంగా వున్నందున ఆ యిల్లు కూలిపోలేదు. ప్రభువు బోధలు విని వాటిని నిత్యజీవితంలో ఆచరించే మంచి శిష్యుడు ఈలాంటివాడు. ఇంకో మందమతి వున్నాడు. అతడు వరదపారే ఇసుక ప్రదేశంలో ఇల్లు కట్టాడు. పెనుగాలీ జడివానా వచ్చాయి. పెద్ద వరద పారింది. ఆ మందమతి యిల్ల ఈ వరదలో ఇసుక పునాది మిద వుంది. వరద ఆ యిసుకను కాస్త కోసుకొని పోయింది. ఇంక ఆ యిల్లెక్కడ నిలుస్తుంది? అది నేల మట్టమయింది. ప్రభు బోధలు విన్నా నిత్యజీవితంలో వాటిని ఆచరించకుండా అశ్రద్దచేసే చెద్ద శిష్యుడు ఈ బుద్ధిహీనునిలాంటి వాడు.

పాలస్తీనా దేశంలో నీటి వెల్లవపారే పల్లపు నేలను "వాడి" అంటారు. జడివాడ కురిసినప్పడు మాత్రం ఈ పల్లంలో గుండా నీళ్ళ వాగులాగ పారతాయి. వానలేనప్పడు ఈ పల్లపు నేల మామూలు నేలలాగే ఎండి వుంటుంది. ఇక్కడ బుద్ధిహీనుడు ఈలాంటి "వాడి"లో ఇల్లు కట్టాడు. అది వరదకు తట్టుకోలేక కూలిపోయింది.