పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/174

ఈ పుట ఆమోదించబడ్డది

7. ఇద్దరు బాకీదారులు - లూకా 7,41-47.

1. సందర్భం

ఓ మారు క్రీస్తు ఓ ప్రార్థనా మందిరంలో బోధించాడు. అక్కడ వున్న వారిలో పరిసయుడైన సీమోను ప్రముఖుడు. అతడు క్రీస్తుని విందుకు ఆహ్వానించాడు. రబ్బయిలను భోజనానికి పిలవడం యూదుల ఆచారం, అతిథులు విందు ఆరగిస్తూండగా తలవని తలంపుగా ఓ s వచ్చింది. ఆమె పాపాత్మురాలు. అంటే యిక్కడ వ్యభిచారిణి అనే భావం. ఈమె మరియ మగ్డలీనా గాదు, లాజరు సోదరి మరియూ గాదు. మరో ఆవిడ. ఎవరైతేనేం, అంతకుముందే ఆమె ప్రభువుని కలుసుకొని తన పాపాలకు పశ్చాత్తాపపడింది. ప్రభువు ఆమె తప్పిదాలను క్షమించి ఆమెను ఓదార్చాడు. అందువల్ల ఆమె కృతజ్ఞతాభావంతో పరిమళ ద్రవ్యం తీసికొని వచ్చి ప్రభువు పాదాలకు పూసింది. ఎనలేని కృతజ్ఞతతోను పూజ్యభావంతోను ఆ పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకొంది. వాటిమిూద కన్నీళ్ళ కార్చింది. ఆ మహానుభావుని పాదాలను కన్నీటితో తడిపానే అని ఆందోళనం జెంది గబగబ తన తలవిూది ముసుగుదీసి తన తలవెండ్రుకలు విప్పి వాటిని తుడిచింది. యూదస్త్రీ మగవాళ్ళ యొదట తలవెండ్రుకలు విప్పడం అమర్యాద. అలా చేసిన స్త్రీకి భర్త విడాకులు ఈయవచ్చు కాని యిక్కడ ఈమె భక్తిపారవశ్యం వల్ల ఈ నియమాలను పాటించలేదు. సీమోనుకు ఆ స్త్రీ హృదయంలో క్రొత్తగా గలిగిన మార్పేమి తెలియదు. పైగా ఆమెలాంటి పాపాత్మురాలు పదిమంది యెదుటికి రావడం, ఓ రబ్బయిని చేతులతో తాకడం ఎంతో అమర్యాద. కనుక సీమోను ఆమెను గూర్చి చెడ్డగా భావించడం మొదలెట్టాడు. ఆ స్త్రీ తన్ను అలా తాకుతూంటే చూస్తూ ఊరకున్న ఈ రబ్బయి ఏపాటి వాడా అని గూడ శంకించాడు. ఆ సందర్భంలో క్రీస్తు చెప్పిన సామెత యిది.

2. వివరణం

ఓ ఋణదాతకు ఇద్దరు బాకీదారులున్నారు. ఒకడు పెద్ద మొత్తము ఇంకొకడు చిన్న మొత్తమూ బాకీపడి వున్నారు. వాళ్లు బాకీ తీర్చలేని పరిస్థితికి ooro exococos యిద్దరినీ క్షమించి వదలివేసాడు. ఆ యిద్దరిలో ఎవరు ఋణకర్త పట్ల అధిక కృతజ్ఞతాభావం చూపుతారు? యజమానుడు ఎవరికి ఎక్కువ ఋణం మన్నించాడో అతడే గదా?

ఈ సామెతలో ఋణదాత పరలోకంలోని తండ్రి వంటి వాడు. అతని బాకీదారులు సీమోనూ పాపాత్మురాలైన స్త్రీ. కాని అతనికంటె ఆమె ఋణం ఎక్కువ. కాని దేవుడు దయతో ఆ యిద్దరి తప్పిదాలూ నున్నించాడు. ఐనా ఆ పాపాత్మురాలి తప్పిదాలు గొప్పవి గనుక ఆమె అధిక కృతజ్ఞతా భావం ప్రదర్శించింది. క్రీస్తు పట్ల ఆమె చూపిన కృతజ్ఞత దేవునిపట్ల చూపినట్లే.