పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/153

ఈ పుట ఆమోదించబడ్డది

తెలియజేయమన్నాడు. ఈ సందర్భంలో ఓ వాక్యం చాల ముఖ్యం. క్రీస్తు ఆమెతో "నేను నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ మీ దేవుడూ ఐన వానియొద్దకు ఆరోహణం చేస్తున్నాను" అన్నాడు - యోహా 20,17. క్రీస్తు మరణిజ్ఞానాలద్వారా మనకు పాపపరిహారం జరిగింది. మనకు దేవునితో రాజీ కుదిరింది. క్రీస్తు తండ్రి ఆ క్రీస్తు ద్వారానే మనకుగూడ తండ్రి ఔతాడు. మనం అతనికి బిడ్డలమౌతాం. అనగా మనం పవిత్ర త్రీత్వంలోనికి ప్రవేశిస్తాం. ఆ త్రీత్వం దివ్యజీవనంలో పాలు పొందుతాం. ఇదంతా క్రీస్తుద్వారా జరుగుతుంది. ఇది గొప్ప వేదసత్యం.

స్త్రీలను గౌరవంతో జూడని యూద సమాజంలో క్రీస్తు మొదటిసారిగా వాళ్ళను గౌరవంతో జూచాడు. ప్రభువు స్త్రీలను ఆదరంతో జూచినందున తొలినాటి క్రైస్తవ సమాజంగూడ వాళ్ళను విలువతో జూచి ప్రోత్సహించింది. ఆనాటి సుప్రసిద్దులైన స్త్రీల పేర్లను కొన్నిటిని నూతవేదం పేర్కొంటుంది. వీళ్ళల్లో కొందరు పౌలుకి వేదబోధలో సహాయం చేసారు. విశేషంగా అతడు ఫీబె, ప్రిస్కా అనే భక్తురాళ్ళను పేర్కొన్నాడు. వాళ్లు "క్రీస్తు సేవలో నాకు తోడి పనివాళ్లు" అని చెప్పకొన్నాడు - రోమా 16, 1-3. ప్రిస్కా సుప్రసిద్ధ బోధకుడైన అపాల్లోకే ఉపదేశం చేసింది - అ,చ 18,26. ఫిలిప్ప కొమార్తెలు నల్లురు ప్రవచనం చెప్పడంలో దిట్టలు - అ,చ. 21,9. అప్పటికే స్త్రీలు కన్యలుగా, వివాహితలుగా, విధవలుగా గుర్తింపు పొందారు. వాళ్ళంతా ఆనాటి క్రైస్తవ సమాజాల్లో నానా పరిచర్యలు చేస్తుండేవాళ్లు.

క్రీస్తు ఉత్థానానంతరం శిష్యులు యెరూషలేం నగరంలోని ఓ యింటి మీదిగదిలో ప్రార్ధన చేసికొంటూ ఆత్మరాకడ కొరకు వేచియున్నారు. ఈ శిష్యులతోపాటు పుణ్యస్త్రీలుకూడ వున్నారు. కనుక శిష్యులతోపాటు వాళ్ళకూడ ఆత్మనీ ఆత్మ వరాలనూ పొందారు - అ,చ, 1, 14.

6. మహిళాభ్యుదయం

ప్రభువు స్త్రీలను ఆదరంతో జూచాడు కదా! అతని నుండి మనం పాఠం నేర్చుకోవాలి. మనది పురుషాధిక్యం గల సమాజం. పెత్తనమంతా మగవాళ్ళదే. స్త్రీలను చిన్నచూపు చూస్తాం. ఇది క్రీస్తు భావాలకు విరుద్ధం.

ఇక్కడ మామూలుగా స్త్రీలను ఆదరంతో జరిగే అన్యాయాలను కొన్నిటిని జ్ఞప్తికి తెచ్చుకొందాం. కొందరు స్త్రీశిశువుని తల్లి గర్భంలో వుండగానే చంపివేస్తారు. కొందరు ఆడపిల్ల పుట్టినందుకు విచారిస్తారు. చాలమంది బాలికలకు విద్య నేర్పరు. వాళ్ళను పనికత్తెలనుగా వాడుకొంటారు. కొంతమంది స్త్రీలను అశుదురాళ్లనుగా ఎంచుతారు.